Viral photo: అసలే కార్తీకమాసం. ఎటు చూసినా అంతా శివనామ స్మరణమయం. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. కార్తీకమాసం అంటేనే భక్తిభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రతి భక్తుడు, భక్తురాలు తెలతెలవారగానే స్వామి వారిని దర్శించుకోవడం ఈ మాసం ప్రత్యేకత. అయితే కీసరగుట్ట లో కార్తీక మాసం సంధర్భంగా ఓ వింత జరిగింది. ఆ వింతను కనులారా వీక్షించిన భక్తులు.. జై హనుమాన్.. జై జై హనుమాన్ అంటూ నినదించారు. అసలేం జరిగిందంటే…
ఆ ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులంతా దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు ఆలయంలో వెలసిన శివలింగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ.. శివయ్యా మా తప్పులు మన్నించుమయా, మము కరుణించుమయా అంటూ వేడుకుంటున్నారు. అంతలోనే అక్కడ అద్భుతం.
కీసరగుట్ట లో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. అందరూ స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అక్కడికి ఓ వానరం హఠాత్తుగా చేరుకుంది. సాధారణంగా వానరం ఆలయం వద్దకు వచ్చిందంటే చాలు.. కొబ్బరి కాయలను కానీ, అరటి పండ్లను కానీ తీసుకెళ్లడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ వానరం అలా చేయలేదు సుమా. అలా వచ్చిన వానరం.. ఏకంగా తన శిరస్సు వంచి, శివలింగాన్ని తాకుతూ అలాగే ఉండి పోయింది.
అసలేం చేస్తుందంటూ వానరాన్ని గమనించిన భక్తులు, ఓం నమః శివాయ అంటూ రెండు చేతులు జోడించారు. అలాగే జై హనుమాన్ అంటూ నినదించారు. ఆ వానరం 5 నిమిషాలు అలాగే ఉండిపోవడం అధ్బుత ఘట్టం అంటున్నారు భక్తులు. కార్తీకమాసం అంటే ప్రజానీకానికి మాత్రమే పవిత్ర మాసం కాదు.. ఈ లోకంలో ఉన్న పశుపక్షాదులకు, జంతువులకు కూడా పవిత్రమాసమేనంటూ ఈ వానరం చాటి చెప్పిందంటున్నారు భక్తులు.
Also Read: Tirumala Update: రేపు తిరుమలకు వెళుతున్నారా.. ఈ పూజ మిస్ కావద్దు.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?
అలాగే ఈ లోకమంతా శివయ్య మయం అంటూ అద్భుతాన్ని చూసిన భక్తులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వానరం కీసరగుట్టలో శివలింగానికి మ్రొక్కుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు నెటిజన్లు కూడా లైకుల మీద లైకులు ఇస్తున్నారు. ఇటువంటి అరుదైన దృశ్యాలు చూసినప్పుడు, నాలోన శివుడు గలడు.. నీలోన శివుడు గలడు.. అన్నింటా శివుడు గలడని అనాల్సిందే. మరి రెండు చేతులు జోడించి ఓం నమః శివాయ అని పలుకుదాం.. ఆ శివయ్య కరుణా కటాక్షం పొందుదాం!
శివలింగానికి మొక్కుతున్న వానరం.. ఫోటో వైరల్
కార్తీక మాసం నేపథ్యంలో భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
నిన్న కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసిన భక్తులు
ఆ సమయంలో శివలింగానికి మొక్కుతూ తన్మయత్వంలో మునిగిన ఓ వానరం
సోషల్ మీడియాలో… pic.twitter.com/T1vTLVGhRx
— BIG TV Breaking News (@bigtvtelugu) November 12, 2024