Biogas Plants AP: ఏపీకి పెట్టుబడులు ఒకొక్కటిగా తరలి వస్తున్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్ ముందుకు రాగా, ఇప్పుడు రిలయన్స్ వంతైంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 65 వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విషయంలో మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది.
అమెరికా పర్యటనకు వెళ్లే ముందు ముంబై వెళ్లారు మంత్రి లోకేష్. రెండురోజుల అక్కడ అంతర్జాతీయ స్థాయి వ్యాపారవేత్తలను కలిశారు. ముంబై టూర్ సక్సెస్ అయ్యిందని, పెట్టుబడులు రావడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
ఈ టూర్‌లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కొడుకు అనంత్‌తో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇరువురు మధ్య పెట్టుబడుల అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రధానంగా కేంద్రం తీసుకొచ్చిన జీవ ఇంధన ప్రాజెక్టులపై చర్చ జరిగింది.
ఏపీలో 500 బయో గ్యాస్ ప్లాంట్ లు పెట్టేందుకు ముందుకొచ్చింది. వాటి విలువ అక్షరాలు 65,000 వేల కోట్ల రూపాయలు. దీనివల్ల ప్రత్యక్షం, పరోక్షంగా 2,50,000 మందికి ఉపాధి కలగనుంది. రిలయన్స్ గుజరాత్ బయట పెడుతున్న అతి పెద్ద పెట్టబడి ఇదే తొలిసారి.
ALSO READ: సీఎం చంద్రబాబుతో చంద్రశేఖర్ భేటీ, ఏపీకి టాటా బూస్ట్, 40 వేల కోట్లతో..
ఒక్కో ప్లాంట్‌కు 130 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. రాష్ట్రంలో ఉన్న బంజరు భూముల్లో ఆయా ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. మంగళవారం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమల శాఖ-ఆర్‌ఐఎల్ మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది.
ఏపీలో ఉద్యోగ కల్పన అనేది మా లక్ష్యాలలో ఒకటని చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి క్లీన్ ఎనర్జీ పాలసీలో అనేక ప్రోత్సాహకాలతో ముందుకు వచ్చామని తెలిపారు. చర్చలు జరిగిన నెలలోపు ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని ఓ ‘బిజినెస్ డైలీ’ వెల్లడించింది.
ఆర్ఐఎల్‌తో డీల్‌పై ప్రభుత్వ వర్గాలు సానుకూలంగా స్పందించారు. రైతులు తమ ఆదాయాన్ని ఏటా ఎకరాకు రూ. 30,000 పెంచుకోవచ్చని అంటున్నాయి. అదే సమయంలో బయోగ్యాస్ ప్లాంట్లు రాష్ట్రానికి ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలు దక్కనున్నాయి. ఎస్‌జిఎస్‌టి వసూళ్లు, విద్యుత్ సుంకం, ఉపాధి కారణంగా పన్నుల ద్వారా రూ. 57,650 కోట్లు వస్తాయని ప్రాథమిక అంచనా.