BigTV English

Matka First Review : మట్కా ఫస్ట్ రివ్యూ..

Matka First Review : మట్కా ఫస్ట్ రివ్యూ..

Matka First Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ మట్కా ‘.. ఇది పాన్ ఇండియా మూవీగా రాబోతుంది. ప్రముఖ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా తెరకెక్కుతోంది.. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇక నవంబర్ 14 న రాబోతున్న సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మట్కా టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..


వరుణ్ తేజ్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌తో సహా అన్ని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. మట్కా పర్ఫెక్ట్ స్క్రీన్‌ప్లే తో మొదటి నుండి చివరి వరకు యాక్షన్ సీన్లతో రేసీగా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. ఈ మూవీ రన్ టైమ్ మొత్తం 2 గంటల 39 నిమిషాల రన్‌టైమ్‌తో రానుంది. టైటిల్స్ లేకుండా, రన్‌టైమ్ 2 గంటల 33 నిమిషాలు ఉంటుందని సెన్సార్ రిపోర్ట్ లో వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీకి ఈ టైం ఫర్ఫెక్ట్ టైమింగ్ అనే చెప్పాలి..

మట్కా ఫస్ట్ రివ్యూ..


వరుణ్ తేజ్ మట్కా మూవీలో ఫస్ట్ హాఫ్‌లో ఉత్కంఠభరితమైన ఇంటర్వెల్ బ్లాక్‌తో సహా 4 ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది.. సినిమా చివరి 20 నిమిషాలు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలవనుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు బావుందట. ఇక డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవల్ అంటున్నారు. మట్కా గేమ్ అనేది కేవలం సినిమాలో ఒక భాగం మాత్రమే. సెకండ్ ఆఫ్ మొత్తం స్టోరీని రివిల్ చెయ్యనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు కీలకమైన వ్యక్తి వాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది, అతని 16 సంవత్సరాల వయస్సు నుండి 52 ఏళ్ల వ్యక్తి లైఫ్ జర్నీ ఈ సినిమా. అతని పాత్ర వయస్సు పెరిగే కొద్దీ అతని వాయిస్, బాడీ లాంగ్వేజ్ తో పాటుగా స్క్రీన్ ప్రెజెన్స్‌లో వైవిధ్యాన్ని వరుణ్ తెజ్ కనబరిచాడు. సెన్సార్ రిపోర్ట్ పూర్తి పాజిటివ్ గా ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశం ఉంది..

దీపావళి తర్వాత నవంబర్ 14 కు కాంపిటేషన్ ఎక్కువగా ఉంది. ఈ రోజున మట్కా తో పాటుగా తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘ కంగువ’ కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో రాబోతుంది. ఇంచు మించు రెండు ఒకే యాక్షన్ కథలతో వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×