E-Paper
Advertisement

రూట్ చూపిస్తుంది.. QR కోడ్ స్కాన్ చేస్తుంది! boAt Storm Call 3 ఫీచర్లు నెక్స్ట్ లెవెల్!

రూట్ చూపిస్తుంది.. QR కోడ్ స్కాన్ చేస్తుంది! boAt Storm Call 3 ఫీచర్లు నెక్స్ట్ లెవెల్!
Advertisement

boAt Storm Call 3 review: మీరు వాచ్ కొంటే కేవలం టైమ్ చూడటానికే కాదు బాస్.. ఇప్పుడు ట్రెండ్ మారింది! చేతికి కట్టుకుంటే రూట్ మ్యాప్ చూపించాలి, ఫోన్ మాట్లాడాలి, అత్యవసరమైతే కాపాడాలి. అలాంటి అన్ని క్రేజీ ఫీచర్లతో బోట్ బ్రాండ్ నుంచి మార్కెట్లోకి వచ్చేసింది boAt Storm Call 3. ఈ స్మార్ట్‌ వాచ్‌లో మునుపెన్నడూ లేని విధంగా టర్న్-బై-టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కాలింగ్, ఎమర్జెన్సీ SOS వంటి అదిరిపోయే స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ సెట్ అయ్యే ఈ స్టైలిష్ వాచ్ కంప్లీట్ రివ్యూ ఇప్పుడు చూసేద్దాం.

boAt Storm Call 3 పూర్తి ఫీచర్లు:

1.టర్న్-బై-టర్న్ నావిగేషన్ :

ఈ వాచ్ కి ఉన్న బిగ్గెస్ట్ హైలైట్ ఇదే. మీరు బైక్ మీద వెళ్తున్నప్పుడు ప్రతి సారీ జేబులోంచి ఫోన్ తీసి మ్యాప్స్ చూడాల్సిన అవసరం లేదు. ఈ వాచ్ మీ ఫోన్ మ్యాప్స్ కి కనెక్ట్ అయి, స్క్రీన్ పైనే ఎటు వెళ్లాలో క్లియర్ గా చూపిస్తుంది. ఈ ఫీచర్ ఈ ప్రైస్ రేంజ్‌లో రావడం నిజంగా మైండ్ బ్లోయింగ్.

2. బిగ్ అండ్ బ్రైట్ 1.83″ HD డిస్‌ప్లే:

Advertisement

ఇందులో పెద్ద 1.83 ఇంచుల (4.6 cm) డిస్‌ప్లే ఇచ్చారు. దీని వల్ల మెసేజ్‌లు, నోటిఫికేషన్లు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు.. Watch Face Studio ద్వారా మీ మూడ్‌కి నచ్చినట్లు ఓన్ వాచ్ ఫేసెస్ డిజైన్ చేసుకోవచ్చు. లుక్ పరంగా ఇది చాలా ప్రీమియం అండ్ స్టైలిష్ గా కనిపిస్తుంది.

3. అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ కాలింగ్ & QR ట్రే:

బైక్ నడుపుతున్నా.. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నా ఫోన్ ఎత్తకుండా వాచ్ నుంచే మాట్లాడేయొచ్చు. దీని లోని ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగున్నాయి. ఇక ఇందులో.. ఇచ్చిన QR ట్రే ఫీచర్ ద్వారా మీ పేమెంట్ క్యూఆర్ కోడ్స్‌ని వాచ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. షాపుల్లో బిల్ కట్టేటప్పుడు ఫోన్ తీయకుండా వాచ్ చూపిస్తే చాలు!

Advertisement

Also Read: జేబులో డబ్బులు మిగలాలి, సౌండ్ అదిరిపోవాలి! రూ.1000లోపు బెస్ట్ బడ్జెట్ సౌండ్‌బార్ ఇదే..

4. ప్రాణాలు కాపాడే ‘Emergency SOS’:

ఈ రోజుల్లో సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ వాచ్‌లో ప్రత్యేకంగా Emergency SOS ఫీచర్ ఇచ్చారు. ఏదైనా ఆపద వస్తే, వాచ్ ద్వారానే మీ క్లోజ్డ్ వన్స్‌కి అలర్ట్ మెసేజ్ లేదా కాల్ వెళ్లేలా సెట్ చేసుకోవచ్చు. అటు అబ్బాయిలకు, ఇటు అమ్మాయిలకు ఇది చాలా యూస్‌ఫుల్ ఫీచర్.

5. క్రెస్ట్+ ఓఎస్ అండ్ కాయిన్స్ :

బోట్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘Crest+ OS’ వల్ల వాచ్ పెర్ఫార్మెన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. దీని లోని ఫిట్‌నెస్ ట్రాకర్లు మీ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ ని కచ్చితంగా ట్రాక్ చేస్తాయి. మీరు ఫిట్‌నెస్ గోల్స్ రీచ్ అయిన ప్రతిసారీ మీకు boAt Coins వస్తాయి, వాటితో బోట్ వెబ్‌సైట్‌లో ఆఫర్లు పొందవచ్చు. అంటే హెల్తీగా ఉంటే రివార్డ్స్ అన్నమాట.

రూ.2వేల లోపు బడ్జెట్‌లో నావిగేషన్, సేఫ్టీ కోసం SOS, అదిరిపోయే డిస్‌ప్లే, ఇంకా కాలింగ్ ఫీచర్ ఉన్న ఆల్‌రౌండర్ స్మార్ట్‌వాచ్ కావాలి అనుకుంటే మాత్రం boAt Storm Call 3 కి తిరుగులేదు. యూత్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే గ్యాడ్జెట్ ఇది.

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×