E-Paper
Advertisement

Fertilizer Shortage: వ్యవసాయ రంగంపై వార్ ఎఫెక్ట్.. మళ్లీ ఎరువుల సంక్షోభం వచ్చే చాన్స్..!

Fertilizer Shortage: వ్యవసాయ రంగంపై వార్ ఎఫెక్ట్.. మళ్లీ ఎరువుల సంక్షోభం వచ్చే చాన్స్..!
Advertisement

Fertilizer Shortage: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తిపై వార్ ఎఫెక్ట్ పడింది.. ఫర్టిలైజర్ తయారీకి కావల్సిన అమ్మోనియా, సహజ వాయువుల దిగుమతి యుద్ధం వల్ల దాదాపుగా నిలిచిపోయే ప్రమాదం ఉంది.. ప్రస్తుతం ఉన్న నిల్వలతో అరకొర ఉత్పత్తి సాగుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో ప్రొడక్షన్ నిలిచిపోయే అవకాశాలున్నాయి.. దీంతో ఇప్పటికే ఎరువుల కొరత ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగం మరింత ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది.

ఖతార్ ఇతర గల్ఫ్ దేశాల నుండి..

రామగుండం ఎరువుల కర్మాగారం పై అంతర్జాతీయ యుద్ధ పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడి సరుకులు అయిన అమ్మోనియా, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి, ఎరువుల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ప్రధానంగా ఖతార్ ఇతర గల్ఫ్ దేశాల నుండి అందాల్సిన సహజ వాయువు, అమ్మోనియా సరఫరాలో కోత విధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆర్.ఎఫ్.సీ.ఎల్ గ్యాస్ ఆధారిత కర్మాగారం కావడంతో, దీని పనితీరుకు ప్రతిరోజూ 2 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ అవసరం. సాధారణంగా ఖతార్ నుండి గుజరాత్‌లోని వాహేజ్ టర్మినల్‌కు, అక్కడి నుండి నౌకల ద్వారా కాకినాడకు, ఆపై పైప్‌లైన్ ద్వారా రామగుండంకు గ్యాస్ సరఫరా అవుతుంది. అయితే యుద్ధం కారణంగా ఖతార్‌లో గ్యాస్ ఉత్పత్తులు నిలిచిపోవడంతో సరఫరా కు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Also Read: Paraquat Ban: అసెంబ్లీలో గడ్డి, కలుపు మందు పై చర్చ వచ్చేలా చూస్తాం: కోదండ రెడ్డి

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో..

ప్రస్తుతం యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఆర్.ఎఫ్.సీ.ఎల్ లో ఎరువుల ఉత్పత్తి సుమారు 15 శాతం మేర తగ్గిపోయింది. ఆర్.ఎఫ్.సీ.ఎల్ కర్మాగారంలో ప్రతిరోజూ 3,950 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉండగా, గ్యాస్ కొరత కారణంగా ప్రస్తుతం ఉత్పత్తి 3,300 టన్నులకు పడిపోయింది. అంటే రోజువారీగా సుమారు 550 టన్నుల ఉత్పత్తి తగ్గిపోవడంతో కర్మాగారం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తయారయ్యే యూరియాలో దాదాపు 30 నుండి 40 శాతం వరకు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తారు. ఒకవేళ ఇదే విధంగా గ్యాస్ సరఫరాలో కోత కొనసాగితే, రానున్న రోజుల్లో యూరియా ఉత్పత్తి మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది నేరుగా రాష్ట్రంలోని వ్యవసాయ రంగంపై మరియు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విదేశాల నుండి దిగుమతి అయ్యే యూరియా రవాణాకు కూడా అడ్డంకులు ఎదురవుతుండటంతో పరిస్థితి మరింత జటిలంగా మారనుంది.

Advertisement

Also Read: GHMC Workers: జీహెచ్ఎంసీ కార్మికుల పై ఆగని శ్రమ దోపిడీ.. జీతాల్లో భారీ కోతలు

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×