E-Paper
Advertisement

Paraquat Ban: అసెంబ్లీలో గడ్డి, కలుపు మందు పై చర్చ వచ్చేలా చూస్తాం: కోదండ రెడ్డి

Paraquat Ban: అసెంబ్లీలో గడ్డి, కలుపు మందు పై చర్చ వచ్చేలా చూస్తాం: కోదండ రెడ్డి
Advertisement

Paraquat Ban: స్వేచ్ఛ బ్యూరో: గడ్డి మందు.. కలుపు మందు రెండు ప్రమాదకరమేనని .. వీటిపై అసెంబ్లీ లో చర్చ వచ్చేలా కృషిచేస్తామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. సీఎం కు, స్పీకర్ కు, శాసనసభ వ్యవహారాల మంత్రికి నివేదిక ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీఆర్కే భవన్‌లో రాష్ట్రంలో దేశంలో నిషేదిత గడ్డి మందు, కలుపు మందుల వలన జరిగే నష్టాలపై వ్యవసాయశాఖ అధికారులు, ఐఎంఏ అధికారులతో చర్చించారు. గ్లైఫోసేట్, పారాక్వాట్ హెర్బిసైడ్ ప్రమాదకర ప్రభావాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ కూలీలా కొరత తో చాలామంది రైతులు వీటిని వాడుతున్నారన్నారు.

గడ్డిమందుపై పోరాటం..

విదేశాల్లో తయారైన ఈ మందులో ఇక్కడ విచ్చల విడిగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. విష రసాయనాలతో తయారైన ఈ మందులతో నేలంతా చెడిపోతుందని, కేవీఎన్ రెడ్డి వ్యవసాయ భూమిని కౌలుకి ఇస్తే నేలంతా ఖరాబ్ అయ్యిందన్నారు. మళ్లీ మాములు స్థితికి రావడానికి మూడేండ్లు పట్టిందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారానే నేల, పంట బాగుంటుందన్నారు. సంఘటితంగా రైతులు లేకపోవడం మరో కారణం అన్నారు. కన్జ్యూమర్ గురించి ఆలోచించే రైతులు కూడా చాలా బాధపడ్తున్నారన్నారు. డాక్టర్లు కూడా గడ్డిమందుపై పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. క్షణికావేశంతో చాలామంది రైతులు గడ్డి మందు తాగి ఎంతోమంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్పత్తి చేసే దేశాలు వారి దేశాల్లో నిషేధించాయని, కానీ ఇతర దేశాల్లో అమ్మకాలు చేపట్టడం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కూడా దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: DCC Appointments: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం డీసీసీలు:​ మహేష్​ కుమార్ గౌడ్

70 దేశాలు నిషేధం..

రైతు కమిషన్ సభ్యుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ గడ్డిమందును కట్టడి చేయడంలో విఫలం అవుతున్నామన్నారు. భూమి కూడా పాడైపోతుందని, గడ్డి మందు తాగి చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డున పడ్తున్నాయన్నారు. సభ్యుడు కేవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ప్యారాక్వాట్ నిషేదించాల్సిందే నని డిమాండ్ చేశారు. 70 దేశాలు నిషేధిస్తే మనం వాడుతున్నాం.. ఇది బాధాకరం అన్నారు. కార్పొరేట్ కుట్రల్లో భాగమే అని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో పారాక్వాట్ నిషేధంపై నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సూచించనుందని, లేదంటే క్యాన్సర్ రోగులు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యురాలు భవానీ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పారాక్వాట్ నిషేదించేలా ఉద్యమించాలని, సోషల్ మీడియా వేదికగా పోరాటం చేద్దాం అని పిలుపు నిచ్చారు. నిషేదించకపోయినా నిలువరిద్దాం అన్నారు.

Advertisement

Also Read: Urdu School: బయట పడ్డ ఉర్దూ మీడియం హై స్కూల్ బండారం.. మరీ ఇంత నిర్లక్ష్యమా..!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×