E-Paper
Advertisement

Cm Revanth : మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!

Cm Revanth : మోడీతో యుద్ధమే..రాష్ట్రంలో ఏం జరగబోతోంది!
Advertisement

కేంద్రంతో కొట్లాడేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోందా? హస్తిన ఆదేశాల మేరకు సీఎం రేవంత్ ఆ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి పలు సవరణలు చేసింది. అంతేకాకుండా ఉపాధి హామీ చట్టానికి మహాత్మాగాంధీ పేరు తొలగించింది. జీ రామ్ జీ అని కొత్తగా నామకరణం చేసింది. దీనిని జాతీయ కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది.

కేంద్రంతో తెలంగాణ రాపో ఎలాఉందంటే..

ప్రస్తుతం కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం రాపో బాగుంది. రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నది. యూరియా సరఫరా, పంచాయతీ, కార్పొరేషన్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు వంటివి, నేషనల్ హైవేస్, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కూల్స్‌కు నిధుల సహాయం, ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై సానుకూల స్పందనే కనిపిస్తున్నది. రాష్ట్రం నుంచి మంత్రుల బృందం వెళ్లినప్పుడు కేంద్రం పాటిజివ్‌గానే స్పందిస్తున్నది. ఇటువంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో యుద్ధం చేస్తామని ప్రకటించడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

పార్టీ పరంగానే.. ప్రభుత్వ పరంగా కదా..

Advertisement

కేంద్రం తెచ్చిన కొత్త ఉపాధి చట్టంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం గుర్రుగా ఉన్నది. హస్తిన ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నిన్న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పలు కీలక తీర్మానాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణలో కేంద్రం తెచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది రేవంత్ సర్కార్. దీనిని అంగీకరించబోమని ముఖ్యమంత్రి సైతం స్పష్టం చేశారు. అయితే, కేంద్రం
ఉపాధి హామీ చట్టాన్ని అదానీ, అంబానీల కోసమే మార్పులు చేసిందని.. వారికి ఉపాధి దక్కకుండా చేయాలని కుట్ర చేస్తున్నదని సీఎం రేవంత్‌తో పాటు మంత్రులు సైతం ఆరోపిస్తున్నారు. తక్కువ కూలీకి కార్మికులను కార్పొరేట్లకు కట్టబెట్టాలనే మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.

Garuda Scheme In AP: ఏపీలో కొత్తగా గరుడ పథకం.. ఆ సమయంలో కుటుంబానికి సహాయం

Advertisement

ఇదిలాఉండగా, సీఎం రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలపై భిన్నాభిస్వరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అటువంటి సమయంలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని, నిధులు రాబట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇటువంటి సమయంలో యుద్ధాలు చేస్తాననడం, కేంద్రం కయ్యం పనికిరాదని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ సైతం ఇలాగే కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వారని తీరా ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఆవేశం పనికి రాదని ఆలోచన ముఖ్యమని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఇదిలాఉండగా, కాంగ్రెస్ నుంచి సైతం కేంద్రంతో కయ్యం కేవలం ఉపాధి హామీపై మాత్రమే అని.. మిగతా విషయాల్లో కాదని చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సఖ్యత గానే ఉంటుందని, జాతీయ నాయకత్వం సూచన మేరకు పార్టీ తరఫున నిరసనలు ఉంటాయని పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

 

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×