Warangal : వరంగల్ బస్ స్టాండ్ సమీపంలో ఈ నెల 5న దుండగుల దాడిలో గాయపడ్డ రాకేష్ అనే యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందాడు. నగరంలోని కాశిబుగ్గ శాంతినగర్ కు చెందిన రాకేష్ అనే యువకుడిపై దుండగులు దాడి చేశారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు, డబ్బును దోచుకున్నారు.
దుండగుల దాడిలో తీవ్ర గాయాలపాలైన రాకేష్ ను స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి రాకేష్ మృతి చెందాడు. దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా దాడికి పాల్పడ్డ నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.