Big Tv Relaunch: తెలుగు న్యూస్ మీడియా చరిత్రలో బిగ్ టీవీ సరికొత్త అధ్యాయం మొదలైంది. నిఖార్చైన జర్నలిజం ఎలా ఉంటుందో ఈ తరానికి చూపిస్తోంది బిగ్ టీవీ. ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజెంటేషన్ చూపించనుంది. సామాన్యుడి మాటలా, ప్రజల గొంతుకగా, నిస్సహాయకులకు ప్రతినిధిగా కొత్తగా ప్రజలు ముందుకొచ్చింది రీ లాంచ్‌తో బిగ్ టీవీ న్యూస్ ఛానెల్ ప్రజల ముందుకొచ్చింది.
ఒక్క ఆలోచనతో బిగ్ టీవీ రీ లాంఛ్- ఇవాళ బిగ్ డే ఫర్ బిగ్ టీవీ గ్రూప్ అని ఛైర్మన్ వెన్నం విజయ్‌రెడ్డి గారు తెలిపారు. గడిచిన రెండు దశాబ్దాలుగా తెలుగు టీవీ మీడియా రంగంలో పెద్దగా మార్పులు లేవన్నారు. ఇదే సమయంలో సొసైటీలో రోజురోజుకూ వస్తున్న మార్పులను గమనించిన తర్వాత, గడిచిన ఆరు నెలలుగా తమ ఛానెల్‌లో రకరకాల మార్పులు చేస్తూ వచ్చామన్నారు. కేవలం ఛానెల్ లుక్ మాత్రమే కాదు, బిగ్ టీవీ గ్రూప్‌లోని అన్ని విభాగాల ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం ఇందులో భాగమేనన్నారు. టీవీ ఛానెళ్లకు ప్రజలు దూరమవుతున్న సమయంలో తెరపైకి రీఎంట్రీ రూపంలో బిగ్ టీవీ ఎంట్రీ ఇచ్చిందన్నారు. కేవలం టెక్నాలజీ పరంగా కాకుండా సోషల్ మీడియా, అందుకు అనుగుణంగా వచ్చిన మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. మారుమూల పల్లెటూరికి అర్థమయ్యే రీతిలో ఉండాలన్నది ఆలోచనగా చెప్పారు.
నిజాయతీగా, నిష్పక్షపాతంగా- అదే సమయంలో ట్యాగ్ లైన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. బిగ్ టీవీ కేరళ లాంచ్ సమయంలో హైకోర్టు జడ్జి మాట్లాడుతున్న సమయంలో వచ్చిన పదాన్ని ‘వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్’ ట్యాగ్ లైన్‌గా తీసుకొచ్చామన్నారు. దీనిపై అనిల్‌తో కలిసి చర్చించి ఫైనల్ చేశామన్నారు. ఇప్పుడున్న జర్నలిజానికి భిన్నంగా ట్యాగ్ లైన్ చేర్చామన్నారు. విత్ అవుట్ ఫియర్ ఆర్ ఫేవర్‌గా బిగ్ టీవీ ముందుకు వెళ్తే.. భవిష్యత్తులో రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది కదా అని ఛీఫ్ ఎడిటర్ అశోక్ అడిగిన ప్రశ్నకు విజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘‘మనది యూట్యూబ్ ఛానెల్ కాదు. మినిస్టరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్, హోం మినిస్టరీ నుంచి రెగ్యులేట్, వెరిఫైడ్ అయిన ఛానెల్. మనం అన్నీ వెరిఫై చేసుకొనే వార్తలు ఇస్తాం. నిజాయతీగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సమాచారం అందిస్తాం. ఎవరికీ ఫేవర్ చేయం. ఫేవర్ తీసుకోం’’ అని వెల్లడించారు.
ట్రెండ్ మారింది- చీఫ్ ఎడిటర్ అశోక్ గారు మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో దక్షిణ భారతంలో అతి పెద్ద న్యూస్ నెట్ వర్క్‌గా బిగ్ టీవీ నిలిచిందన్నారు. టెలివిజన్ న్యూస్ రంగంలో వ్యూహకర్త అనిల్ అరూర్ చేరికతో బిగ్ టీవీ మలయాళం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందన్నారు. ఈ క్రమంలో వ్యూహకర్త అనిల్ అరూర్ గారు మాట్లాడారు. టెక్నాలజీ పరంగా రోజు రోజుకూ మార్పులు వస్తున్నాయని, ట్రెండ్ కు తగ్గట్టుగా మార్పులు చేసినట్టు చెప్పారు. ఆడియన్స్ ని ఆకట్టుకునేలా స్టోరీ నేరేషన్, సామాన్యుడికి అర్థమయ్యు రీతిలో మార్పులు చేపట్టినట్టు తెలిపారు.ఈ విషయంలో మలయాళం బిగ్ టీవీ సక్సెస్ అయ్యిందని, ఆ మార్పులను గమనించిన తెలుగులోనూ మార్పులు చేసినట్టు వివరించారు. తెలుగు టీవీ న్యూస్ మీడియాలో ‘వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్’ ట్యాగ్ లైన్ విషయాన్ని ఛైర్మన్ విజయ్‌రెడ్డి గారుతో కలిసి చర్చించి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ విధంగా ఏ ఛానెల్‌కు లేదని మనసులోని మాట బయటపెట్టారు. అలాగే తెలుగు-మలయాళం మధ్య తేడాను ఈ సందర్భంగా వివరించారు.
విజన్-క్రియేటివిటీ= బిగ్ టీవీ- బిగ్ టీవీ ఛానెల్ సీఓఓ రూప ఇందుకూరి గారు కీలక విషయాలు బయటపెట్టారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత దేశంలోని అన్ని పరిశ్రమలు అప్ గ్రేడ్ అయ్యాయని, న్యూస్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు లేవన్నారు. జర్నలిజంలోకి వచ్చే యువతీ యువకులకు ట్యాగ్ లైన్ ఆలోచించి వస్తారన్నారు. ఇదొక వండర్ ఫుల్ జర్నీగా వర్ణించారు ఆమె. చాలా ఇన్నోవేషన్స్‌తో ప్రజల ముందుకు వస్తున్నామని, చాలామంది బ్రాండ్-బిజినెస్ పార్టనర్స్ చాలా ఎక్సైట్‌గా ఉన్నారన్నారు. మీడియా ట్రాన్సఫర్మేషన్ ఎవరూ చూడలేదని, బిగ్ టీవీ ఛానెల్‌లోని అన్ని విభాగాలు దీన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు వివరించారు. దీని వెనుక ఛైర్మన్ విజయ్‌రెడ్డి విజన్, అనిల్ క్రియేటివిటీ కలిసి స్క్రీన్‌పై ఆవిష్కరించినట్టు తెలిపారు. గడిచిన ఆరునెలలుగా బిగ్ టీవీ ఛానల్‌లోని అన్ని విబాగాలు ఆ విధంగా ఎడాప్ట్ చేసుకున్నాయని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అసలైన వార్తలు ఎలా ఉంటాయో ప్రజలు మరిచిపోయారని అన్నారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో బిగ్ టీవీ ఇప్పుడు కళ్లకు కట్టినట్టు చూపించనున్నట్లు వివరించారు. అందరం ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, కచ్చితంగా సాధ్యమవుతుందన్నారు.
ALSO READ: మీడియాలో ‘బిగ్ టీవీ’ కొత్త అధ్యాయం.. ప్రత్యక్ష ప్రసారాలతో రీ-ఎంట్రీ.. ప్రజల వైపే మా పయనం!