BigTV English

Telangana Assembly: అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల : మంత్రి శ్రీధర్

Telangana Assembly: అతి త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల : మంత్రి శ్రీధర్

8th Day Telangana Assembly Session: ఎనిమిదవరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. మూడు బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉండటంతో ఈరోజు కూడా సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ స్కిల్ వర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి దానిపై చర్చించారు.


అతిత్వరలోనే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తామని మంత్రి శ్రీధర్ ప్రకటించారు. మొత్తం 2 లక్షల ఉద్యోగాలను.. వివిధ శాఖలలో భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు. అందుకే యువతకు స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. స్కిల్స్ పెంపుపై యూనివర్సిటీల వీసీలు, పారిశ్రామికవేత్తలతో చర్చించామని.. రాష్ట్ర యువతకు ఇక్కడే ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

మార్కెట్లో ఉన్న డిమాండ్లకు అనుగుణంగా యువతకు స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. అంతర్జాతీయ పరిశ్రమలు కూడా ఇక్కడికే వచ్చి కంపెనీలు పెట్టేలా స్కిల్స్ నేర్పిస్తామన్నారు. ఇది సరికొత్త ఆలోచన అని, రాష్ట్ర ప్రభుత్వం యువత భవిష్యత్ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవుతుందన్నారు మంత్రి శ్రీధర్.


Related News

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Hooligans in Madhapur: బైక్‌పై వెళ్తున్న యువతిని వేధించిన ఆకతాయిలు.. అక్కడ తాకేందుకు ప్రయత్నం..

Medak Flood: మెదక్ రామాయంపేటలో వరద ఆందోళన.. హాస్టల్‌లో చిక్కుకున్న 400 విద్యార్థులు

Kamareddy floods: కామారెడ్డిలో వర్షాల బీభత్సం.. 60 మందిని రక్షించిన రియల్ హీరోస్!

Big Stories

×