E-Paper
Advertisement

దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో

దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. తెలంగాణలో భారీ వర్షాలు, ఇక హైదరాబాద్‌లో
Advertisement

Weather News: దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల జోరు మొదలైంది. రెండు వారాలుగా బలహీనపడిన రుతుపవనాలు, ప్రస్తుతం వేగంగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ-ఐఎండీ తెలిపింది. దక్షిణాదితోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి.

దేశవ్యాప్తంగా చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

Advertisement

భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రుతుపవనాల జోరు క్రమంగా పుంజుకుని దేశం వైపు కదులుతున్నట్లు ప్రకటించింది. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకినప్పటికీ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నినో ధాటికి వర్షాలు ముఖం చాటేశాయి. జూన్ మూడోవారానికి దేశవ్యాప్తంగా 41 శాతం వర్షపాత లోటు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పొడి వాతావరణం, ఆపై ఎండలతో అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలో ఐఎండీ తాజా బులెటిన్ విడుదల చేసింది. అరేబియా సముద్రం మీదుగా వీస్తున్న బలమైన గాలుల కారణంగా వర్షాలు అవకాశముందని తెలిపింది. జూన్ 19-25 మధ్య ఎంపీ, విదర్భ, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సాధారణం నుంచి విస్తారమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Advertisement

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం పడే ఛాన్స్

వర్షానికి తోడు ఉరుములు, మెరుపులు తోడు అవుతాయని తెలిపింది. జూన్ 21 అనగా ఆదివారం నుంచి మంగళవారం వరకు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ భారత్‌లో కేరళ, కర్ణాటక, తమిళనాడు తెలంగాణ ప్రాంతాలతో పాటు సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

ఇక తెలంగాణ విషయానికి వద్దాం. అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే 1 లేదా 2 గంటల పాటు అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో రాబోయే 2 గంటల పాటు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అంచనా వేసింది.

ALSO READ: హైడ్రా పేదల ఇళ్ల జోలికెళ్లదు.. కబ్జాలు నిర్థారించాకే చర్యలు.. కమిషనర్ రంగనాధ్

ఇక హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వాతావరణం వరకు పొడిగా ఉంటుందని తెలిపింది. రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో రాత్రి నుంచి చిన్నపాటి వర్షం పడింది. అది క్రమంగా తగ్గుముఖం పట్టింది. రానున్న 2 గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×