E-Paper
Advertisement

మోదీ దీపావళి సెంటిమెంట్ నుండి అమెరికా స్పీచ్ వరకు.. బన్సాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మోదీ దీపావళి సెంటిమెంట్ నుండి అమెరికా స్పీచ్ వరకు.. బన్సాల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

Sunil Bansal: స్వేచ్ఛ బ్యూరో: వికసిత్‌ భారత్‌ నిర్మాణమే ముందున్న లక్ష్యమని, భారతదేశ అభివృద్ధిని మన కళ్లతో చూడాలన్నదే ప్రతి జాతీయవాది సంకల్పమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్‌ బన్సాల్‌ అన్నారు. ఎన్నో ఏళ్లుగా కన్న కలలు నేడు సాకారమవుతున్నాయని, దేశం నక్సలిజం నుంచి విముక్తి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. దేశంలో ఇంకా మిగిలి ఉన్న దైహిక నక్సలిజంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి, జాతీయవాద భావజాలం, దేశభక్తి విలువల పరిరక్షణతో పాటు జాతీయ చైతన్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌ హాల్‌లో జాతీయవాదుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సునీల్‌ బన్సాల్‌ మాట్లాడుతూ.. గత 12 ఏళ్లలో దేశంలో ఎన్నో చారిత్రక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు దేశ చరిత్రలో కీలక పరిణామాలని పేర్కొన్నారు.

కార్యకర్తలకు కీలక పిలుపు..

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రతిష్ఠ అంతర్జాతీయ స్థాయిలో పెరిగిందని అన్నారు. పశుపతినాథ్‌ ఆలయం నుంచి రుద్రాక్షమాల, కాషాయ వస్త్రాలతో వచ్చిన మోదీ.. మైనస్‌ ఉష్ణోగ్రతల్లో సరిహద్దుల్లో సైనికులతో దీపావళి జరుపుకోవడం, అమెరికా గడ్డపై భారత్‌ మాతాకీ జై నినాదం వినిపించడం, స్వచ్ఛ భారత్‌ కోసం స్వయంగా చీపురు పట్టడం వంటి ఘటనలు దేశభక్తికి, నాయకత్వానికి నిదర్శనమన్నారు. భారత్‌ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చెందిన, బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలంటే సంస్థాగతంగా పార్టీ శక్తిని పెంచుకోవాలని, తమ ఆలోచనలకు అనుగుణమైన వ్యవస్థ నిర్మాణానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

రాంచందర్ రావు మాట్లాడుతూ..

Advertisement

అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. కాసం వెంకటేశ్వర్లు ఏబీవీపీ నుంచి అంచెలంచెలుగా ఎదిగి కర్ణాటక సహ ఇన్‌చార్జిగా జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఏబీవీపీ, యువమోర్చా, బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏబీవీపీని బలోపేతం చేసిన వారిలో కాశం వెంకటేశ్వర్లు ఒకరని కొనియాడారు. దేశంలో జాతీయ భావన పెరుగుతోందని, అది మరింత విస్తరించేందుకు జాతీయవాదులంతా కృషి చేయాలని కోరారు. విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ దేశవ్యతిరేక వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు. గతంలో ఏబీవీపీ కార్యకర్తలపై హత్య కేసులు నమోదు చేసిన సందర్భాలున్నాయని పేర్కొన్నారు. వ్యక్తులపై ఆధారపడకుండా పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలం ఆధారంగా బీజేపీని బలోపేతం చేయాలని సూచించారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కర్ణాటక సహ ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏబీవీపీలో పనిచేసిన ఎంతోమంది సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అందరూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ జాతీయవాద భావజాలాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కమ్యూనిస్టులు ఏబీవీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ఎదురొడ్డి నిలిచిన చరిత్ర ఉందన్నారు. ఎంతోమంది త్యాగాల ఫలితంగానే నేడు ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. కార్యకర్తలు ఎన్నడూ పదవులు, డబ్బు ఆశించి పనిచేయలేదని, సిద్ధాంతం బతకాలని, దేశం కోసం జీవించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.

Also Read: షూటింగ్స్‌కు వెళ్లవద్దని బాబాయ్ మందలింపు.. 21 ఏళ్ల  యువతి ఆత్మహత్య!

Tags

Related News

క్యాన్సర్ బాధితులకు బిగ్ రిలీఫ్.. ఇక హైదరాబాద్ రానక్కర్లేదు.. జిల్లాల్లోనే ఉచిత కీమోథెరపీ!

షూటింగ్స్‌కు వెళ్లవద్దని బాబాయ్ మందలింపు.. 21 ఏళ్ల  యువతి ఆత్మహత్య!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. మిత్రపక్షాల మద్దతు కోరిన రేవంత్ రెడ్డి

నిర్మల్ గడ్డ.. కాషాయ అడ్డా! తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే: బండి సంజయ్

చెంగిచెర్లలో హైడ్రా హల్చల్.. రియల్ ఎస్టేట్ ముఠా దందా గుట్టు రట్టు!

అయ్యప్ప భక్తులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. శబరిమల యాత్రకు ప్రత్యేక బస్సులు!

జలమండలికి సవాల్‌తో కూడిన మెగా ఆపరేషన్.. చకా చకా రిపేర్లు!

Big Stories

Advertisement
×