BigTV English

Weather Report: ఈసారి వానలు ఆలస్యం.. ఎండ మరింత కాలం.. ఎల్‌నినో కూడా!

Weather Report: ఈసారి వానలు ఆలస్యం.. ఎండ మరింత కాలం.. ఎల్‌నినో కూడా!

Weather Report: రోహిణి రాకముందే రోకళ్లు పగులుతున్నాయి. ఏపీలో టెంపరేచర్ హాఫ్ సెంచరీ టచ్ అవుతోంది. తెలంగాణలో 45 డిగ్రీలు దాటేసింది. ఎండ మండుతోంది. బయటికొస్తే మాడు పగులుతోంది. రోహిణి కార్తె వస్తే ఇంకెలా ఉంటుందో పరిస్థితి. ఈ ఎండ వేడి తగ్గాలంటే.. ఒక్కటే మార్గం. వానలు పడాలి. వానలు పడాలంటే.. రుతుపవనాలు రావాలి. కానీ, ఈసారి నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందని భారత వాతావరణ విభాగం-IMD వాన కబురు వేడిగా చెప్పింది.


అవును, ఈసారి మాన్‌సూన్స్ లేట్ అవుతాయట. జూన్ 4న కేరళ తీరాన్ని తాకే ఛాన్స్ ఉందట. జూన్ 4 అనేది ఓ అంచనా మాత్రమే. రియల్‌గా మరింత ఆలస్యమయ్యే అవకాశామే ఎక్కువ. ఈ న్యూసే ఇప్పుడు భగ్గు మంటోంది.

మామూలుగా అయితే జూన్ 1న కేరళను టచ్ చేయాలి నైరుతి రుతుపవనాలు. 2020లో జూన్ 1న, 2021లో జూన్ 3న, 2022లో మే 29 నాటికే కేరళ తీరానికి చేరుకున్నాయి మాన్‌సూన్స్. కానీ, గతానికి భిన్నంగా ఈసారి సుమారు 4 రోజులు ఆలస్యం కానున్నాయని IMD చెబుతోంది. అంటే, ఈ ఎండలను మరింత కాలం భరించాల్సిందేనా?


ఎందుకు ఆలస్యం అంటే.. ఎల్‌‌నినో వల్లే అంటోంది వాతావరణ శాఖ. ఈ పదం వినగానే బెంబేలవుతున్నారు జనం. అసలే ఫుల్ ఎండలు.. ఇక ఎల్‌నినో కూడా తోడైతే..? వానలు కూడా పడకపోతే..? పరిస్థితి ఇంకెంత అధ్వాన్నంగా ఉంటుందో?

అయితే, అంతగా భయపడాల్సిన పనిలేదంటోంది ఐఎమ్‌డి. ఎల్‌నినో పరిస్థితులు ఉన్నప్పటికీ.. దేశంలో ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం కాస్త ఊరట.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×