BigTV English

Hyderabad Crime: నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. లాస్ట్ మెసేజ్ లో ఏముందంటే?

Hyderabad Crime: నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. లాస్ట్ మెసేజ్ లో ఏముందంటే?

Hyderabad Crime: ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు. పని ఒత్తిడి, మానసిక స్థైర్యం కోల్పోవడం, ఇతర అంశాలు కారణాలేమో ఏమో కానీ గత కొద్దిరోజులుగా నగరంలో అక్కడక్కడ ఆత్మహత్య ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన జరిగింది. బ్రతుకుదెరువు కోసం సుదూర ప్రాంతం నుండి వచ్చిన సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఏకంగా 6 అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.


హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. ఓ ఐటీ కంపెనీలో వెస్ట్ బెంగాల్ కు చెందిన రిటోజ బసు (22) హెచ్ఆర్ గా పని చేస్తోంది. కొంతకాలంగా సిద్ధిఖ్ నగర్ లోని ఓ హాస్టల్ లో రిటోజ నివాసముంటూ.. సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా నగరంలో జీవనం సాగిస్తోంది. అయితే బుధవారం ఆరో అంతస్తు పైకి వెళ్లిన రిటోజ.. అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే మృతురాలి వద్దగల మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, వివరాల కోసం పరిశీలించారు. తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు ఇన్ స్ట్రాగ్రామ్ లో మెసేజ్ చేసి రిటోజ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంతకు ఆ మెసేజ్ ఎవరికి చేసిందనేది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు వెల్లడించారు. రిటోజ ఆత్మహత్యకు ప్రేమ కారణమా.. లేక పని ఒత్తిడా.. మరి ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. మొత్తం మీద రిటోజ ఆత్మహత్య వెనుక గల కారణాలు పోలీసుల ప్రకటనతోనే బహిర్గతమవ్వాల్సి ఉంది.


Also Read: Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. మీ ఖాతాలో నగదు జమ.. ఓ సారి చెక్ చేసుకోండి

ఈ సంధర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మానసిక స్థైర్యాన్ని కోల్పోయి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని కోరారు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని పోలీసులు సూచించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×