Rythu Bharosa Scheme: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26వ తేదీన ప్రారంభమైన రైతు భరోసా పథకాన్ని కొనసాగింపుగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం అండదండగా నిలవాలని ఉద్దేశంతో రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి దశలో పలువురు రైతులకు నగదు జమ కాగా, రెండవ దఫా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
సాగులో ఉన్న రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం రైతు పరస్పతకాన్ని ప్రవేశపెట్టింది. జనవరి 26 తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, ఏడాదికి అర్హులైన రైతులందరికీ రూ. 12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే రెండు విడతలుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా, ఇప్పటికే పలువురు రైతులకు రూ. 6 వేలు నగదు ఖాతాలో పడింది.
ప్రభుత్వం రైతన్నల పక్షాన నిలుస్తూ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్.. పేరుకే స్కీములు ప్రవేశపెడుతున్నారని విమర్శలు గుప్పించింది. దీనితో ప్రభుత్వం రైతులకు జమ వివరాలను కూడా ప్రజల ముందు ఉంచగా.. బీఆర్ఎస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.
Also Read: Minister Seethakka: ఇదే సరైన సమయం, ఆ పార్టీని నిలదీయండి-సీతక్క
బుధవారం రైతు భరోసా నిధుల జమ రెండవ దశ అమల్లోకి వచ్చిందని, ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం రూ. 17.03 లక్షలు రైతుల ఖాతాల్లో జమవుతుందని ప్రకటించారు. రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వం జాబితాను కూడా ప్రజల ముందు ఉంచింది. ఆ అర్హుల జాబితాలో గల రైతులకు నేడు నగదు జమకానున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఖాతాలో నగదు జమ అయిందా.. ఓసారి చెక్ చేసుకోండి.