Kirti Kulhari : తాజాగా ఓ బాలీవుడ్ బ్యూటీ మూవీ షూటింగ్ తర్వాత తాను చేసిన ఓ పని చూసి అందరూ తనను లెస్బి*యన్ అనుకున్నారు అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఇంతకీ ఈ హీరోయిన్ ఏం చేసింది ? జనాలు ఎందుకలా అనుకున్నారు? అనే వివరాల్లోకి వెళితే…
ఆ పని వల్ల డిసైడ్ చేశారా?
బాలీవుడ్ నటి కీర్తి కుల్హారి (Kirti Kulhari) తనకు ఇండస్ట్రీలో ఎదురైన విచిత్రమైన అనుభవం గురించి వెల్లడించింది. ఇప్పటిదాకా మనం సినిమా ఇండస్ట్రీలో నటినటులకు ఎదురయ్యే క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు, ఇతర సమస్యల గురించే విన్నాము. కానీ ఇప్పుడు మాత్రం ఆమె మరో కొత్త సమస్యని వెల్లబోసుకుంది. ప్రస్తుతం తన తాజా చిత్రం ‘హిసాబ్ బరాబర్ (Hisaab Barabar)’ ప్రమోషన్లలో ఉన్న కీర్తి ఓ ఇంటర్వ్యూలో జుట్టు వల్ల ఓ పెద్ద అపార్థం జరిగిందంటూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.
తాజా ఇంటర్వ్యూలో తన కొత్త లుక్ కారణంగా అందరూ తనను లెస్బి*యన్ అనుకున్నారు అంటూ అసలు ఏం జరిగిందో వెల్లడించింది. అమ్మాయిల జుట్టు విషయంలో సమాజం ఆలోచనలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి ఎలా ఉంటుందో ఈ అమ్మడు వెల్లడించింది. సాధారణంగానే చాలామంది అమ్మాయిలకు జుట్టు పొడుగ్గా ఉంటే ఇష్టం. అలాగే అబ్బాయిలు కూడా పొడుగు జుట్టు ఉన్న అమ్మాయిలను చూడగానే పడిపోతారు. కొంతవరకు ఇది నిజమైనప్పటికీ మరి కొంతమందికి మాత్రం జుట్టు మీద అంతగా ఆసక్తి ఉండదు.
తాజాగా కీర్తి (Kirti Kulhari) మాట్లాడుతూ “హిసాబ్ బరాబర్ మూవీ షూటింగ్ పూర్తయ్యాక ఇంటికెళ్లి నా జుట్టును కట్ చేసుకున్నాను. అయితే నా షార్ట్ హెయిర్ స్టైల్ చూసి అందరూ నేను లెస్బి*యన్ అని కామెంట్స్ చేయడం వినిపించింది. అలా జుట్టు కట్ చేసుకుంది, కాబట్టి త్వరలోనే తాను లెస్బి*యన్ అని ప్రకటిస్తుంది అనే గుసగుసలు నాకు వినిపించాయి. అయితే నేనేమీ లెస్బియన్ కాదు. కానీ పొడవాటి చుట్టూ ఉంటేనే అమ్మాయిలు అయిపోతారా? జుట్టు కట్ చేసుకున్నంత మాత్రాన లెస్బి*యన్స్ అయిపోతారా?” అంటూ షూటింగ్ టైంలో ఎదురైన విచిత్రమైన అనుభవాన్ని వెల్లడించింది.
కీర్తి కుల్హారి ఎవరు?
కీర్తి కుల్హారి (Kirti Kulhari) 2010లో ‘కిచ్డి: ది’ మూవీతో తన బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె ‘పింక్’ సినిమాతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. అలాగే షైతాన్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ వంటి భారీ చిత్రాలలో నటించింది. ఆమె హిట్ వెబ్ సిరీస్ ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్!’లో కూడా నటించింది. ప్రస్తుతం ఆర్. మాధవన్, నీల్ నితిన్ ముఖేష్ లతో కలిసి కీర్తి నటించిన ‘హిసాబ్ బరాబర్’ (Hisaab Barabar) రిలీజ్ అయింది. అశ్విని ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంకు లావాదేవీలో ఓ చిన్న సమస్య రాగా, దాని వెనకాల దాగి ఉన్న అవినీతిని వెలికితీసే రైల్వే టికెట్ కలెక్టర్ స్టోరీ ఇది.