E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!
Advertisement

El Nino Effect: ఖమ్మం జిల్లాలో ఈసారి సీన్ డిఫరెంట్‌గా మారింది. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పత్తి, మిరప జోలికి వెళ్తే రిస్క్ ఎక్కువని భావించారు రైతులు. ఎక్కువ వాటర్ అవసరం అయ్యే పంటల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం కూడా పదే పదే చెప్పింది. దీంతో తక్కువ నీటితో, తక్కువ టైంలో చేతికొచ్చే బెండ, టమాటా, దోస, చిక్కుడు, వంకాయ, బీర, సొరకాయల సాగు వైపు మొగ్గు చూపారు. అప్పులు చేసి మరీ వేలల్లో ఇన్వెస్ట్ చేశారు.

రైతన్న లెక్కలన్నీ రివర్స్..

Advertisement

ప్రభుత్వం ఊహించిన దాని కంటే దారుణంగా వర్షపాతం ఉంది. అందుకే రైతన్న లెక్కలన్నీ అన్నీ రివర్స్ అయ్యాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వరుణుడు పూర్తిగా ముఖం చాటేశాడు. కూరగాయల పంటలకు కావలసిన వర్షం కూడా పడలేదు. పోనీ బోర్ల వైపు చూస్తే… అండర్‌గ్రౌండ్ వాటర్ లెవల్స్ డేంజర్ జోన్‌కు పడిపోయాయి.

రైతుల నడుం విరుస్తున్న పవర్ కట్స్ 

Advertisement

నీటి ఎద్దడి ఒకవైపు అయితే.. పవర్ కట్స్ మరోవైపు రైతుల నడుం విరుస్తున్నాయి. కొద్దో గొప్పో ఉన్న పాతాళ గంగను తోడుకుందామన్నా కరెంట్ కష్టాలు వెంటాడుతున్నాయి. కూరగాయలు పూతకు వచ్చే కీలక దశలో సరిపడా నీరు అందక, మోటార్లు రన్ అవ్వక పంట తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.

 మధిర అన్నదాతల ఆవేదన..

మరికొన్ని రోజుల్లో నీళ్లందించకపోతే పంట పూర్తిగా నాశనం అవ్వడం ఖాయం. కనీసం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అయినా వెనక్కి వస్తుందో లేదో తెలియక మధిర అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆల్టర్నేటివ్ పంటలు వేసినా ప్రకృతి సహకరించక, పవర్ సపోర్ట్ లేక దెబ్బతింటున్న తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read: ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

Tags

Related News

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

గద్వాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు..!

గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!

సూర్యపేట జిల్లాలో తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

Big Stories

Advertisement
×