Kavitha: స్వేచ్ఛ బ్యూరో: అధికారంలో ఉంటేనే సభకు వస్తారా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ నాయకులు.. కాంగ్రెస్ కన్నా ఎక్కువగా దోచుకున్నారన్నారు. ఆ పార్టీ నాయకులకు ప్రజల కోసం పోరాటం చేయాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు గొప్పులు చెప్పుకుంటూ సభను తన అడ్వర్ టైజ్ మెంట్ కోసం వాడుకుంటే బీఆర్ఎస్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలను కౌంటర్ చేసే వాళ్లే సభలో లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలను సస్పెండ్ చేస్తే…కౌన్సిల్ లో ఎందుకు మాట్లాలేదని ప్రశ్నించారు. కౌన్సిల్ లో వాకౌట్ చేయాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీశారు. ప్రజలు బీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేశారో అత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు..
అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాలు ఆవేదన కలిగించాయన్నారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన వేదికను అధికార, ప్రతిపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజా సమస్యలను వదిలి ఒకరినొకరు తిట్టుకోవటానికే అసెంబ్లీని వేదికగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పది నిమిషాలు అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేస్తే లక్షలాది మంది ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. కానీ ఆ సోయి మర్చి అధికార, ప్రతిపక్షాలు ప్రజాధనం దుర్వినియోగం చేశాయన్నారు. అటు బీజేపీ సభ్యులుసైతం ప్రజా సమస్యలు వదిలి కాంగ్రెస్ కు కొందరు, బీఆర్ఎస్ కు కొందరు బీఆర్ఎస్ కు మద్దతిచ్చారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 22 ఏ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఇసుక ను మంత్రి సీతక్కకు రాసిచ్చి వారి ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కమీషన్లు పొందుతుందని విమర్శించారు. మూసీ నుంచి ఇసుక వరకు ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడుతున్నారనిమండిపడ్డారు. ఈ నెల 20 న కొడంగల్ లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నామన్నారు. అదే రోజు కొడంగల్ వేదికగానే ప్రభుత్వ అవినీతిని ప్రజలు ముందు పెడతామన్నారు.
Also Read: గణేష్ మండపం పెడుతున్నారా? అయితే ఈ ఆన్‌లైన్ రూల్ తప్పనిసరి!