Allari Naresh:’అల్లరి’ అనే చిత్రం ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి.. సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్న అల్లరి నరేష్ (Allari Naresh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణ(EVV Sathya Narayana) వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ జోనర్ ఎంచుకున్న అల్లరి నరేష్ కి వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ పాత జోనర్ ని నమ్ముకున్నారు. అలా రంభ ఊర్వశి మేనక సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న అల్లరి నరేష్ తాజాగా తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆరుగురు పతివ్రతలు సినిమా అంటే తనకు నచ్చలేదని, అందుకే తాను ఇప్పటివరకు ఆ సినిమా చూడలేదని తెలిపారు.
తన తండ్రి , దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వ వహించిన చిత్రాలలో హలో బ్రదర్ సినిమా అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన ఆయన.. అదే తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన ఆరుగురు పతివ్రతలు సినిమా నచ్చలేదని తెలిపారు. నరేష్ మాట్లాడుతూ..” నాకు ఆరుగురు పతివ్రతలు సినిమా కథ మొదటి నుంచి నచ్చలేదు. అందుకే ఇప్పటివరకు ఆ సినిమా నేను చూడలేదు. ఆరు వేర్వేరు కథలతో కూడిన ఈ చిత్రంలో ఒక ఫ్లో ఉండదు. సినిమా చూస్తున్నంత సేపు సీరియల్ చూసినట్లు ఉంటుంది. ఈ విషయాన్ని అప్పట్లోనే నేను మా నాన్నకు చెప్పాను. ఈ సినిమా విడుదల సమయంలో కూడా చాలా దుమారం రేగింది అంటూ అల్లరి నరేష్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే ఆ సినిమా స్టోరీ తనకు నచ్చలేదని , అందుకే సినిమా చూడలేదని చెప్పుకొచ్చారు.
also read: ఓటీటీలోకి రవితేజ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఇటీవల రంభ ఊర్వశి మేనక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్.. తాజాగా నటిస్తున్న చిత్రం ఆల్కహాల్. మెహర్ తేజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంతో పాటు సతీష్ మల్లంపాటి దర్శకత్వంలో వచ్చిన సభకు నమస్కారం చిత్రంతో పాటు తమిళ చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ తమిళ్ చిత్రానికి అనిల్ సుంకర దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే యేడాది జూలై నెలలో దీనిని రిలీజ్ చేయబోతున్నారు.
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ పెద్ద సినిమాలతో చిన్న సినిమాలో పోటీ పడడం కరెక్టేనా అనే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా మగధీర వంటి పెద్ద చిత్రంతో పాటు నేను నటించిన బెండు అప్పారావు ఆర్ఎంపి విడుదల కావడం , భీష్మ తో పాటు నాంది, పైసా వసూల్ తో పాటు నేను వంటి చిత్రాలు విడుదలవడం యాదృచ్ఛికమే. కావాలని పెద్ద సినిమాలతో పోటీ పడితే చిన్న చిత్రాలకు నష్టం తప్పదు. కానీ కొన్నిసార్లు అనుకున్న తేదీకి కట్టుబడి ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటూ అల్లరి నరేష్ తెలిపారు.