Sabarimalai temple: కార్తీక మాసం మొదలు శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదంతో మార్మోగుతాయి. స్వామి దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అక్కడికి వస్తుంటారు. సోమవారం అనుకోని ఘటనతో అయ్యప్పభక్తులు ఉలిక్కపడ్డారు. అసలేం జరిగింది.
ఇక అసలు విషయానికొద్దాం. స్వాములు దీక్ష విరమించే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ అయ్యప్ప ఆలయంలో ఓ భక్తుడు సన్నిధానం పైనున్న ప్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడి స్వాములు షాకయ్యారు.
అక్కడున్న వెంటనే స్పందించారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భక్తుడు కర్ణాటకకు చెందిన కుమారస్వామిగా గుర్తించారు.
ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం సన్నిధానం నుంచి మళికప్పురం వెళ్లే ప్లైఓవర్ నుంచి దూకినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆ స్వామి మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఆయన టీమ్‌లోని కొందరు చెబుతున్నమాట. స్వామి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆ స్వామి ఆరోగ్యం గురించి తెలియాల్సివుంది.
శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం
నెయ్యాభిషేకం కౌంటర్ల మండపం పై నుంచి దూకిన భక్తుడు#Sabarimala #SuicideAttempt #BigTV pic.twitter.com/58MLZJCywV
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2024