BigTV English

Medaram Jatara Hundi counting: మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం..

Medaram Jatara Hundi counting: మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం..

Medaram Jatara Hundi counting begins


Medaram Jatara Hundi counting begins: ఈ ఏడాది సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ జాతర జరిగింది. దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు ఈ జాతరకు వచ్చినట్లు అంచనా. ఆసియాలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవం అంటే మేడారం సమ్మక్క సారక్క జాతరే. తెలంగాణ కుంభమేళాగా ఈ జాతర పేరుగాంచింది. మేడారం జనసంద్రాన్ని తలపించింది.

ఎంతో మంది భక్తులు సమక్క సారలమ్మలను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు ప్రారంభమైంది. ఈ హుండీల లెక్కింపు పది రోజుల పాటు సాగుతుంది.


Read More: హైదరాబాదీలకు అలర్ట్.. ఈసారి మంటలే..!

ఈ మహాజాతరకు దాదాపు రెండు నెలల ముందు నుంచే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 జరిగిన ఈ జాతరకు 1.45 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

పది రోజులపాటు జరిగే ఈ హుండి లెక్కింపు కార్యక్రమంలో హుండీలను ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసుల సమక్షంలో తెరిచారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్ని హుండీలు దాదాపు నిండిపోయాయని సమాచారం. దేవాదాయ సిబ్బందితోపాటు భక్తి మండళ్లు సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు హుండీలోని కానుకలను లెక్కిస్తున్నారు.

చుట్టూ భద్రత, సీసీ కెమెరాల నిఘా, పోలీసులు, ఆలయ అధికారుల మధ్య ఈ లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో హుండీ ఆదాయం కూడా ఎక్కువ ఉంటుందని అధికారులు, ఆలయ సభ్యలు అంచనాలు వేస్తున్నారు.

Read More: నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్ట

గతేడాది 2022 జాతర సందర్భంగా 11.44 కోట్లకుపైగా హుండీ ఆదాయం వచ్చింది. బంగారం 631 గ్రాములు, వెండి 48 కిలోలు భక్తులు సమర్పించారు. అయితే 2020లో మాత్రం భక్తుల సంఖ్య పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది. కానీ ఈ ఏడాది మాత్రం 2022 జాతరకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఎందుకంటే ఈ సారి రెండు నెలల ముందే మేడారానికి పెద్ద సంఖ్యలో భక్తులు రాక మొదలైంది. ఆదివారం కూడా లక్షల్లో భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. దీంతో ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. గతేడాదితో పొలిస్తే ఈ సారి భక్తుల సంఖ్య కూడా కాస్త పెరగడంతో ఆదాయం కూడా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×