BigTV English

Rinky Chakma: క్యాన్సర్‌తో మాజీ మిస్ ఇండియా మృతి

Rinky Chakma: క్యాన్సర్‌తో మాజీ మిస్ ఇండియా మృతి


Rinky Chakma Death: మాజీ మిస్ ఇండియా త్రిపుర 2017 రింకీ చక్మా(29) బ్రెస్ట్ క్యాన్స‌తో పోరాడుతూ తాజాగా తుదిశ్వాస విడిచారు. 2022లో మాలిగ్నెంట్ ఫిలోడెస్ ట్యూమర్ (రొమ్ము క్యాన్సర్)తో ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ నిర్ధారణ తర్వాత రింకీ శస్త్రచికిత్స చేయించుకుంది. దురదృష్టవశాత్తు ఈ క్యాన్సర్ ఆమె ఊపిరితిత్తులకు వ్యాపించింది.

ఆ తర్వాత ఆమె తలపైకి చేరుకుంది. దీంతో ఇది బ్రెయిన్ ట్యూమర్‌కు దారితీసింది. ఇక కీమో థెరపీ చేయించుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్షిణించింది. ఈ కారణంగానే ఫిబ్రవరి 22న ఆమెను మాక్స్ హాస్పిటల్ సాకేత్‌లో చేర్చారు.


అక్కడ ఆమెను ఐసియులో వెంటిలేటర్‌పై ఉంచారు. అయితే రింకీ హాస్పిటల్‌లో అడ్మిషన్‌కు మూడు రోజుల ముందు.. రింకీ సన్నిహితురాలు, ఫెమినా మిస్ ఇండియా 2017 రన్నరప్ ప్రియాంక కుమారి ఆమె చికిత్స కోసం డబ్బులను సేకరించేందుకు రింకీ మెడికల్ రిపోర్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

READ MORE : కెప్టెన్ మార్వెల్ నటుడు మృతి.. ఆ వ్యాధితో పోరాడుతూ..

గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న తన స్నేహితురాలు రింకీ చక్మా కోసం ఫండ్స్ సేకరిస్తున్నామని ప్రియాంక అభిమానులకు విజ్ఞప్తి చేశారు. రింకీకి మొదట్లో రొమ్ము క్యాన్సర్ ఉందని అన్నారు. అయితే శస్త్రచికిత్స జరిగింది.. కానీ అది తర్వాత ఆమె ఊపిరితిత్తులు, మెదడులోకి వ్యాపించిందని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కీమోథెరపీని కొనసాగించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే రింకీ కూడా కొన్ని వారాల ముందు స్వయంగా ఆర్థిక సహాయం కోరింది. తన కష్టాలను, ఆమె సుదీర్ఘ వైద్య చికిత్స కారణంగా ఆమె కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక భారాన్ని పంచుకుంది. ఆమె సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నప్పటికీ, రింకీ తన చికిత్స కోసం విరాళాను కోరింది.

ఇక ఆమె చివరికి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఆమె మృతిని ఫెమినా మిస్ ఇండియా పోటీల అధికారిక పేజీ ధృవీకరిస్తూ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్ పెట్టింది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×