BigTV English

2024 Bajaj Pulsar NS models: సరికొత్త ఫీచర్లతో 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ మోడల్స్ వచ్చేసాయ్!

2024 Bajaj Pulsar NS models: సరికొత్త ఫీచర్లతో 2024 బజాజ్ పల్సర్ ఎన్ఎస్ మోడల్స్ వచ్చేసాయ్!


2024 Bajaj Pulsar NS models: ప్రముఖ బజాజ్ ఆటో తరచూ కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో కొన్ని మోడళ్లను తీసుకొస్తూ అబ్బురపరుస్తుంది. ఇక ఇప్పటికే ఈ కంపెనీ నుంచి చాలా మోడల్స్ రిలీజ్ అయి బైక్ ప్రియులను ఆకట్టుకున్నాయి.

తాజాగా బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ సిరీస్‌ని కొత్త ఫీచలర్లతో అందుబాటులోకి తెచ్చింది. పల్సర్ ఎన్ ఎస్ 200, పల్సర్ ఎన్ ఎస్ 160, పల్సర్ ఎన్ ఎస్ 125 మోడళ్లను కొత్తగా భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.


కాగా అప్డేటెడ్ మోడళ్లను బజాజ్ ఆటో ఈ ఏడాది చాలా ఆలస్యంగా తీసుకువచ్చింది. అయితే కొత్త ఫీచర్లతో వచ్చినా.. మెకానికల్‌గా ఏ మార్పులు చేయనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

READ MORE: ఇండియాలో లాంచ్ అయిన ట్రయంఫ్​ స్క్రాంబ్లర్​ 1200 ఎక్స్.. ధర రూ.11.83 లక్షలు!

బజాజ్ ఆటో మొత్తం మూడు మోడళ్లను తీసుకురాగా.. వాటి ధరలను కూడా వెల్లడించింది. 2024 పల్సర్ ఎన్ఎస్ 200 ధరను రూ.1,57,427గా నిర్ణయించింది. అలాగే పల్సర్ ఎన్ఎస్ 160 ధరను రూ.1,45,792గా ఉంది. ఇక మూడో మోడల్ పల్సర్ ఎన్ఎస్ 125 ధరను రూ.1,04,922గా కంపెనీ నిర్ణయించింది.

అయితే ఈ ధరలన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇక పల్సర్ ఎన్ఎస్ 200 మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో దర్శనమిచ్చింది. బ్రూక్లిన్ బ్లాక్, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇకపోతే ఈ తాజా పల్సర్ ఎన్ఎస్ సిరీస్‌లో LED డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో సరికొత్త LED హెడ్ ల్యాంప్‌ను అందించారు.

READ MORE: ‘ఎంఎక్స్ మోటో ఎం 16’ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్.. లుక్ అదిరింది.. ధర చాలా తక్కువ గురూ!

ఇక ఇదివరకే LED యూనిట్ ఉన్న రియర్ టెయిల్ ల్యాంప్‌లో ఎటువంటి మార్పులు చేయకుండా.. అలానే కొనసాగించారు. కాగా పల్సర్ 160, పల్సర్ 125 మోడళ్ల విషయానికొస్తే.. ఇందులో కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అమర్చారు. అంతేకాకుండా బజాజ్ రైడ్ కనెక్ట్ అప్లికేషన్ ద్వారా ఎన్ఎస్ 200, ఎన్ఎస్ 160 మోడల్స్ కొత్త బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను అమర్చారు.

ఇది నోటిఫికేషన్లు, టర్న్ బై టర్న్ నావిగేషన్లను, కాల్ మేనేజ్‌మెంట్‌లను సైతం చూపిస్తుంది. వీటితో పాటుగా మొబైల్‌ను ఛార్జింగ్ చేయడానికి యూఎస్బీ పోర్టును కూడా కలిగి ఉంది. మరిన్ని వివరాలకు సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

Tags

Related News

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Big Stories

×