BigTV English

BRS Leaders Migration : నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్టీ

BRS Leaders Migration : నైరాశ్యంలో బీఆర్ఎస్.. పీకల్లోతు కష్టాల్లో కారు పార్టీ

brs party latest news


BRS Key leaders leaving the party(Telangana politics): లోక్‌సభ ఎన్నికల ముందు BRS పార్టీ నైరాశ్యంలో కూరుకుపోతోంది. నేతల వలసలతో ఏం చేయాలో తెలియక.. కేసీఆర్‌ దొర లెక్కలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణవ్యాప్తంగా మున్సిపాలిటీలు చేజారిపోతుంటే.. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలే వరుస షాక్‌లు ఇస్తున్నారు.

నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు నేడు బీజేపీలో చేరనున్నారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ సైతం.. అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్‌లో చేరారు. సిట్టింగ్ ఎంపీలే పార్టీ మారుతుండడంతో BRS ఢీలా పడుతోంది. చేవెళ్ల నుండి పోటీకీ రంజిత్ రెడ్డీ నిరాకరించినట్లు సమాచారం. కేటీఆర్ వైఖరే వల్లే పోటీ చేయడం లేదని నేతలు మాట్లాడుకుంటున్నారు.


అసెంబ్లీ ఎన్నికల తర్వాత కారు పార్టీ.. పీకల్లోతూ కష్టాల్లోకి పడిపోయింది. అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్‌కు ఎదురచెప్పలేని నేతలు సైతం.. ఇప్పుడు పార్టీలో ఉండమంటూ మొహం మీద గుడ్‌ బై చెప్పేస్తున్నారు. దీంతో BRS రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతోంది. అధినాయకత్వం పట్టించుకోక పోవడం వల్లే నేతలు వెళ్లిపోతున్నారనే టాక్‌ జోరుగా నడుస్తోంది.

Read More : నేడే మెగా డీఎస్సీ.. 11,062 పోస్టులకు నోటిఫికేషన్

షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికి ఇంకెంతమంది చేజారిపోతారోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడే వారి సంఖ్య మరింత పెరగవచ్చని.. అధిష్టానం ఆందోళన చెందుతోంది. అసెంబ్లీ పోయినా.. లోక్‌సభతో అయినా బలపడదామని నేతలు భావించారు. కానీ ఆ వ్యూహం కాస్త బెడిసికొట్టింది. సిట్టింగులు నుంచి మాజీలు, చిన్న చిన్న లీడర్లు సైతం పార్టీకి దూరమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు టికెట్లు దక్కని నేతలంతా పక్క పార్టీల్లో చేరారు. కేసీఆర్ సమన్వయ లోపం వల్లే పార్టీకి ఇంత నష్టం జరిగిందని.. నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్‌లతో పాటు నేతలు కొందరు కాంగ్రెస్‌ వైపు చూస్తుంటే.. మరికొందరు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌.. పార్టీ పరిస్థితి చక్కదిద్దకపోతే మరింత నష్టం చవిచూడాల్సి వస్తుందని.. రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అదే జరిగితే బీఆర్ఎస్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దెబ్బ నుంచి ఇప్పట్లో కోలుకోవడం కష్టమే. ఊహించని రీతిలో ఓటమి పాలవ్వడంతో.. కేసీఆర్ ఇప్పటికే బయటికి రావడంలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని ఆయన.. నల్గొండ సభకు మాత్రం హాజరై అధికార పార్టీపై విమర్శలు చేశారు. మళ్లీ ఇంతవరకూ ఎక్కడా కనిపించిందే లేదు. లోక్ సభ ఎన్నికల పుణ్యమా అని ఈసారైనా బయటికి వస్తారేమో చూడాలి.

Tags

Related News

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Theft at Brilliant college: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Big Stories

×