E-Paper
Advertisement

Bandi Sanjay : కవితపై బండి ఘాటు విమర్శలు.. మహిళా కమిషన్ సీరియస్..

Bandi Sanjay : కవితపై బండి ఘాటు విమర్శలు.. మహిళా కమిషన్ సీరియస్..
Advertisement

Bandi Sanjay : ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. అటు ఢిల్లీ, ఇటు తెలంగాణలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. కవితపై చేసిన విమర్శలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు ఆందోళన చేస్తున్నారు. బండి సంజయ్ దిష్టి బొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో నిరసన చేపట్టారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. కవితకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.

Advertisement

కవితపై బండి సంజయ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. బండి సంజయ్ కు నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఢిల్లీలో కవిత విచారణ, హైదరాబాద్ బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో బషీర్‌బాగ్‌ లోని ఈడీ కార్యాలయానికి తాళాలు వేశారు. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. అటు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. బీజేపీ దిష్టి బొమ్మ దహనం చేశారు. బండి సంజయ్ పై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమయ్యారు.

Related News

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

టీచర్స్‌‌కు సీఎం రేవంత్ శుభవార్త.. పీఆర్సీపై కీలక ప్రకటన, రెండేళ్ల తర్వాత..

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×