BigTV English

World Youth Skills Day: సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో.. ఘ‌నంగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం

World Youth Skills Day: సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో.. ఘ‌నంగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం

World Youth Skills Day: సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ&సైన్సెస్ (SITS) క్యాంపస్‌లో జూలై 19న ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి 1,000కిపైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.


ఈ కార్యక్రమాన్ని, Big Tv,  Weave Media, Gurthimpu Foundation ఆధ్వర్యంలో, Digital Employment Exchange of Telangana (DEET), TASK (Telangana Academy for Skill and Knowledge) భాగస్వామ్యంతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక శాఖ, పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖలు ఈ వేడుకకు పూర్తి మద్దతుగా నిలిచాయి.

దివ్యాంగుల సాధికారతపై దృష్టి – గౌరవ వేదిక
దివ్యాంగులకు గుర్తింపు ఫౌండేషన్ ద్వారా.. మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు ఆ సంస్థ పౌండర్ వసుంధర. సిద్దార్ధ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమె.. యువతి, యువకులకు పలు కీలక సూచనలు చేశారు.


యువతకు ఆత్మవిశ్వాసం.. సామాజిక బాధ్యతపై స్పూర్తిదాయక ప్రసంగం
ప్రముఖ నటుడు ఆర్.కె.సాగర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువతను ఉద్దేశించి మాట్లాడుతూ.. నైపుణ్యం ఉన్న యువతే దేశానికి ఆస్తి. మార్పు అనేది ఒక ఆలోచనతో మొదలవుతుంది. హైడీథాన్ లాంటి పోటీలు యువతకు వ్యాపార ఆలోచనలను విస్తరించేందుకు ఉపయోగపడతాయి. యువతలో ఆత్మవిశ్వాసం పెంచి.. వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చాలి అన్నారు.

DEET – యువతకు ఉద్యోగ, వ్యాపార వేదిక
డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణా (DEET).. అడిషనల్ కార్పొరేట్ రిలేషన్స్ డైరెక్టర్ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ.. హైడీథాన్ వంటి కార్యక్రమాల ద్వారా.. విద్యార్థుల నైపుణ్యాలకు సరైన వేదిక కల్పించడమే మా లక్ష్యం అని తెలిపారు. DEET ప్లాట్‌ఫాం ద్వారా యువతకు ఉద్యోగాలు, స్టార్టప్‌ అవకాశాలు అందిస్తున్నాం అని వివరించారు.

సిద్ధార్థ కళాశాల హృదయపూర్వకంగా భాగస్వామ్యం
SITS ప్లేస్‌మెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటేష్ మాట్లాడుతూ.. హైడీథాన్ వంటి కార్యక్రమాలకు మా విద్యాసంస్థ వేదిక కావడం గర్వకారణం. ఈ కార్యక్రమం విద్యార్థుల భవిష్యత్‌కి మార్గదర్శకం అవుతుంది. విద్యార్థులలో మౌలిక నైపుణ్యాల వృద్ధికి ఇది దోహదపడుతుంది అని పేర్కొన్నారు.

గౌరవ అతిథుల నూతన ఆలోచనలు – స్టార్టప్ శక్తికి మార్గనిర్దేశం
ఈ కార్యక్రమంలో వివిధ రంగాల నుంచి ప్రముఖులు పాల్గొన్నారు:

రమేష్ ఇప్పలపల్లి, ఎడిపాయింట్

వడ్డే నవీన్, CEO, అద్వైత గ్లోబల్ ఐటీ లాబ్స్

రోబో కలాం, టెక్నాలజీ డైరెక్టర్, మొహమ్మద్ సజీద్

కృష్ణవేణి, డైరెక్టర్ లీగల్ సర్వీసెస్, 247 డిజిటైజ్

శ్రవణ్, ఫౌండర్, సిద్ధత్వ ఫౌండేషన్

సిమి, ఫౌండర్, సిమి వరల్డ్

ప్రణీత, ఫౌండర్, ప్రనిశా టెక్నాలజీస్

యక్రా గణేష్, ఫౌండర్, సంస్కార్ ఎలక్ట్రానిక్స్

BIGTV – మద్దతుగా నిలిచిన మీడియా భాగస్వామి

BIGTV సంస్థ ఈ కార్యక్రమానికి.. మీడియా భాగస్వామిగా నిలవడం గర్వకారణంగా పేర్కొంది. Hideathon వేదికగా యువతలో మార్పు మొదలవుతుంది. BIGTV నేటి యువతకు నేరుగా కనెక్ట్ అయ్యే విధంగా వార్తలు, అవకాశాలు అందించడంలో ముందుంటోంది. కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలకు వేదికగా నిలిచే కార్యక్రమాలకు మద్దతుగా ఉండే ఈ సంస్థ, Hideathon వంటి మార్పుకు ఊతమిచ్చే కార్యక్రమానికి మీడియా భాగస్వామిగా ఉండటం చాలా గొప్ప విషయం. ఇది కేవలం ఓ ఈవెంట్ మాత్రమే కాదు.. యువతలో మార్పు మొదలయ్యే మొదటి మెట్టు. అందుకే BIGTV వంటి బాధ్యతాయుతమైన మీడియా భాగస్వామ్యం ద్వారా ఇది మరింత ప్రభావవంతంగా ప్రజల్లోకి చేరింది.

గేమ్స్, అవగాహన సెషన్లు, ప్రదర్శనలు – విద్యార్థుల ఉత్సాహానికి వేదిక
ఈ కార్యక్రమంలో విద్యార్థుల కోసం క్రియేటివ్ గేమ్స్, అవగాహన సెషన్లు, ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. హైడీథాన్ తదుపరి దశలపై కూడా సమాచారం ఇచ్చారు. యువతలో చైతన్యం పెంచేలా ఇది ఒక మైలురాయి కార్యక్రమంగా నిలిచింది.

Related News

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఏఐసీసీ ప్రకటన

Telangana Digital Connectivity: గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీలో తెలంగాణ రోల్ మోడల్

Mahesh Kumar Goud: బీసీ రిజర్వేషన్ల కేసు ఖచ్చితంగా గెలుస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

Telangana RTC: హైదరాబాద్‌లో బస్సు ఛార్జీల పెంపు.. జిల్లా బస్సుల్లో కూడా బాదుడు.! టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ

BC Reservations: హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా

Weather Update: రాష్ట్రంలో 4 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల్లో పిడుగుల వర్షం, అత్యవసరం అయితే తప్ప..?

Cough Syrups: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ రెండు దగ్గు మందులు బ్యాన్

Farmer Scheme: వ్యవసాయ భూమి ఉంటే చాలు.. ఈజీగా రూ.50వేలు పొందవచ్చు.. అప్లికేషన్ విధానం ఇదే..

Big Stories

×