BigTV English

Fennel Leaves: సోంపు ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు..ఈ సమస్యలన్నీ మాయం !

Fennel Leaves: సోంపు ఆకులతో అద్భుతమైన ప్రయోజనాలు..ఈ సమస్యలన్నీ మాయం !

Fennel Leaves: సోంపు గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. కానీ సోంపు మొక్క ఆకులు కూడా బోలెడు ప్రయోజనాలను కలిగిస్తాయని చాలా మందికి తెలియదు. నార్త్ ఇండియాలోఅనేక మంది వంటకాల తయారీలో సోంపు ఆకులను ఉపయోగిస్తుంటారు.


ముఖ్యంగా సలాడ్‌లు, సూప్‌లు, కూరల్లో రుచిని పెంచడానికి ఈ ఆకులను ఉపయోగిస్తారు. వీటిని కేవలం రుచి కోసమే కాకుండా.. వాటిలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తున్నారు. సోంపు ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవేంటో.. వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
సోంపు ఆకులు జీర్ణవ్యవస్థకు చాలా మంచివి. వీటిలో ఉండే పీచుపదార్థాలు (ఫైబర్) జీర్ణక్రియను మెరుగు పరచి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. అలాగే, సోంపు ఆకుల్లోని సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా ఇవి ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయ పడతాయి. గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి ప్రభావ వంతంగా పనిచేస్తాయి.


2. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు:
సోంపు ఆకుల్లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఫెర్యులిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. తద్వారా కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధులైన గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు సోంపు ఆకులతో తయారు చేసిన కూరలు తినడం మంచిది. ఇవి శరీరానికి అవసరం అయిన పోషకాలు అందించడంలో మీకు ఉపయోగ పడతాయి.

3. కంటి ఆరోగ్యానికి మేలు:
సోంపు ఆకుల్లో విటమిన్ ఎ (బీటా-కెరోటిన్ రూపంలో) పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో.. రేచీకటిని నివారించడంలో సహాయ పడుతుంది. క్రమం తప్పకుండా సోంపు ఆకులను తీసుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు తరచుగా సోంపు ఆకులు తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

4. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది:
సోంపు ఆకుల్లో కఫహరమైన గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇవి శ్వాసకోశ మార్గాల్లో పేరుకుపోయిన శ్లేష్మాన్ని (కఫం) తొలగించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస కోశ సమస్యలతో బాధ పడేవారికి సోంపు ఆకులు ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిని టీ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Also Read: స్కాల్ప్ మసాజ్‌తో మ్యాజిక్.. లాభాలు తెలిస్తే షాక్ అవుతారు !

5. రక్తపోటును నియంత్రిస్తుంది:
సోంపు ఆకుల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. పొటాషియం శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హైబీపీ ఉన్నవారు తమ ఆహారంలో సోంపు ఆకులను చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు తరచుగా సోంపు ఆకులను భాగంగా చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

Related News

Stone Baby: 82 ఏళ్ల బామ్మ కడుపులో స్టోన్ బేబీ.. వైద్య చరిత్రలో అరుదైన కేసు ఇది!

Kissing Bug: కిస్సింగ్ బగ్.. అమెరికాను వణికిస్తున్న ఈ కీటకం.. ఏం చేస్తుందో తెలుసా?

Caffeine-Dreams: ఏంటీ.. టీ, కాఫీలు మానేస్తే అలాంటి కలలు వస్తాయా? పరిశోధనల్లో ఏం తేలిందంటే?

Brain Eating Amoeba: కేరళలో మెదడు తినేసే అమీబా.. 8 రోజుల్లో నలుగురు మృతి

Afternoon sleeping effects: మధ్యాహ్నం పూట తినగానే పడుకుంటే ఏం జరుగుతుంది?

Weight Loss: జిమ్‌కు వెళ్లలేదు, డైటింగ్ చెయ్యలేదు.. ఏకంగా 40 కిలోలు తగ్గాడు.. అదెలా?

×