E-Paper
Advertisement

Yadadri District: కన్నప్రేమ కరువై.. ఆలయ మెట్లపై పసికందు విలవిల!

Yadadri District: కన్నప్రేమ కరువై.. ఆలయ మెట్లపై పసికందు విలవిల!
Advertisement

Yadadri District: ఒకవైపు.. సంతానం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ.. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, దేవుళ్లకి మొక్కులు చెల్లించుకుంటూ కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూసే దంపతులు. మరోవైపు.. పుట్టిన పసికందును అక్కున చేర్చుకోవాల్సింది పోయి..  కనికరం లేకుండా చెత్తకుప్పల్లోనో, నిర్మానుష్యమైన రోడ్ల పక్కనో వదిలేస్తున్న కన్నప్రేమ లేని మనుషులు. మరికొందరైతే  దేవుడు ఇచ్చిన బిడ్డను దేవుడే చూసుకుంటాడు అనే సాకుతో ఆలయ మెట్లపై వదిలి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..

యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమవారం గ్రామంలో శిశువు పదిలివేతకు సంబంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన ఆడ పసికందును గ్రామంలోని శ్రీ లింగ బసవేశ్వర ఆలయం సమీపంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఆలయానికి వచ్చిన స్థానికులు పసికందు ఏడుపు విని గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు.

Advertisement

ఈ విషయం స్థానిక పోలీసులకు చేరడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు శిశువును సురక్షితంగా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యలు శిశువుకు తక్షణ చికిత్స అందించి ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. శిశువును వదిలిన వారెవరో గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు.

ALSO READ: Viral Video: సీటు కోసం బస్సులో రచ్చ రచ్చ.. జుట్టు పట్టుకుని కొట్లాడుకున్న వీడియో మీరూ చూసేయండి!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×