Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో దారుణమైన ఘటన జరిగింది. కన్న కొడుకు శ్రీధర్ (30)ను తండ్రి నాగయ్య కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. నాగయ్య తన కొడుకు హత్యకు కారణం చెప్పుతూ, శ్రీధర్ తాగుడుకు బానిసైపోయి, తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని వెల్లడించాడు. ఈ కారణంగానే ఆవేశంతో హత్య చేసినట్లు ఆయన పోలీసులకు చెప్పాడు.
తాగుడుకు బానిసై తల్లి పట్ల అసభ్యకర ప్రవర్తన..
పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీధర్ మద్యానికి బానిసై, రోజు కుటుంబంలో సమస్యలు సృష్టిస్తున్నాడు. తల్లి పట్ల అనుచిత ప్రవర్తన కారణంగా తండ్రి నాగయ్యకు కోపం వచ్చింది. ఆ కోపంతో కర్రతో దాడి చేసి, కొడుకును చంపేశాడు. ఈ ఘటన సెప్టెంబర్ 14, 2025న జరిగినట్లు తెలిపారు. స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
అయితే పోలీసులు నాగయ్యపై హత్య కేసు నమోదు చేసి, ఆయనను అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీధర్ కుటుంబ జీవనం ఎలా ఉంది, ఆయన వ్యసనం ఎప్పటి నుంచి మొదలైంది అనే వివరాలు ఇంకా దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. నాగయ్య కుటుంబంలో ఇతర సభ్యులు ఎవరున్నారు, తల్లి పరిస్థితి ఏమిటి అనేవి కూడా తెలియాల్సి ఉంది. పోలీసులు స్థానికులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు.
Also Read: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు
ప్రస్తుత కాలంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు హత్యలకు దారితీయడం ఆందోళనకరం. పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసి, న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఏది ఏమైన ప్రస్తుత సమాజంలో మద్యం మత్తులో తల్లి, చెల్లి అనే వరుసలు ఏమి లేకుండా ప్రవర్తిస్తున్నారు. మద్యం బాటిల్ మీద మద్యం సేవిస్తే హానికరం అని చెప్పిన వినకుండా మద్యానికి బానిసలువున్నారు ప్రజలు.. ఈ మద్య కాలంలో అయితే చిన్న పెద్ద తేడా అనేది ఏమి లేకుండా మద్యం సేవిస్తున్నారు. మద్యం మానుకుంటే తప్ప ఈ సమాజం మారదు అని కొందరు స్థానికులు చెబుతున్నారు.
కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..
తాగుడుకు బానిసై తల్లి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వల్లే హత్య చేసినట్లు చెప్పిన తండ్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో దారుణ ఘటన
కన్న కొడుకు శ్రీధర్ (30)ను చంపిన తండ్రి నాగయ్య
కేసు నమోదు చేసి… pic.twitter.com/EPP0FnCehX
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025