E-Paper
Advertisement

Korutla Bus Stand incident: బుర్కా వేసుకుని బస్సెక్కిన యువకుడు.. మహిళల మధ్య కూర్చుని ఫోన్ మాట్లాడటంతో..

Korutla Bus Stand incident: బుర్కా వేసుకుని బస్సెక్కిన యువకుడు..  మహిళల మధ్య కూర్చుని ఫోన్ మాట్లాడటంతో..
Advertisement

Korutla Bus Stand incident: జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకున్న ఓ వింత ఘ‌ట‌న స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక యువకుడు బుర్కా ధరించి బస్సులో మహిళల మధ్య కూర్చుని ప్రయాణించేందుకు ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ వ్యక్తి తన ఫోన్‌కు వచ్చిన కాల్ ఎత్తి మాట్లాడుతుండగా అసలు విషయం బయటపడింది. బుర్కా లోపల నుంచి మగ గొంతు వినిపించడంతో అప్రమత్తమైన ప్రయాణికులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. వెంటనే ఆర్టీసీ సిబ్బందికి సమాచారాన్ని అందించారు.

సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని విచారించారు. బుర్కా ఎందుకు ధరించావని వారు అడిగిన ప్రశ్నలకు ఆ యువకుడు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అధికారులు నిలదీస్తున్నా ఏ మాత్రం భయం లేకుండా నవ్వుతూ సమాధానాలను దాటవేయడం అక్కడున్న వారిని విస్మయానికి గురిచేసింది. అతని ప్రవర్తన వింతగా ఉండటంతో ఏదైనా నేరపూరిత ఆలోచనతో ఇలా చేశాడా లేక ఉద్దేశపూర్వకంగానే మహిళా ప్రయాణికులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది తదుపరి విచారణ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

సాధారణంగా మహిళలు మాత్రమే ఉండే సీట్లలో బుర్కా ధరించిన వ్యక్తి అనుమానాస్పదంగా కూర్చోవడంతో తోటి ప్రయాణికులకు మొదట అనుమానం కలగలేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అడ్డుపెట్టుకుని ఇలా బుర్కా వేషంలో ప్రయాణించేందుకు సాహసించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళలకు మాత్రమే వర్తించే ఈ ఉచిత ప్రయాణ వెసులుబాటును అక్రమంగా పొందాలనే ఆలోచనతో ఈ వేషధారణ వేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కేవలం ప్రయాణం కోసమే కాకుండా మహిళల మధ్యకు చేరి దొంగతనాలకు పాల్పడే ముఠాలో సభ్యుడా అన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. బహిరంగ ప్రదేశాల్లో ఇటువంటి ఘటనలు జరగడం పట్ల మహిళా ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని అతని నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. గతంలో ఇటువంటి పనులు ఏవైనా చేశాడా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. బస్టాండ్‌లు బస్సుల వంటి రద్దీ ప్రదేశాలలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏవైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా ఆర్టీసీ సిబ్బందికి ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Read Also: Viral Video: ఇదెక్కడి పైత్యం.. బతికున్న భర్తను తల వరకూ పూడ్చి.. నెత్తిన పాలాభిషేకం చేసిన భార్య

Related News

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

Big Stories

Advertisement
×