BigTV English

Viral News : పోలీస్ కార్‌తో రీల్స్.. వీడియో వైరల్.. మీకుందిరా అరేయ్..

Viral News : పోలీస్ కార్‌తో రీల్స్.. వీడియో వైరల్.. మీకుందిరా అరేయ్..

Viral News : పోరగాళ్లు మరీ రెచ్చిపోతున్నారు. లేడీస్ సైతం తక్కువేం కాదు. రీల్స్ మోజులో నానా అరాచకాలు చేస్తున్నారు. ఒకడు రన్నింగ్ ట్రైన్‌తో పరుగెడతాడు. ఇంకోడు పట్టాలపై రైలుకు అడ్డంగా పడుకుంటాడు. పామును మెడలో వేసుకుంటాడొకడు. అదే పాముకు ముద్దు కూడా పెడతాడు. ఇంట్లో, బస్సులో, స్కూళ్లో, పార్కులో, హాస్పిటల్‌లో.. అంతెందుకు స్మశానంలో శవంతో కూడా రీల్స్ చేస్తుంటారు. రీల్స్, షార్ట్స్ యావ ఈమధ్య మరీ ఎక్కువైంది. లైక్స్ కోసం, షేర్ల కోసం, కామెంట్స్ కోసం.. పడి చచ్చిపోతున్నారు. లైక్స్ వస్తే ఒక బాధ.. రాకపోతే ఇంకో బాధ. వ్యూస్ పెరిగితే అలాంటివే మరిన్ని పిచ్చి పనులు చేసేందుకు వెంపర్లాడుతున్నారు. వ్యూస్ రాకపోతే.. అది కాకుండా మరో వెరైటీ పని కోసం ట్రై చేస్తున్నారు. ఇలా ఒకసారి ఆ మైకంలో మునిగితే.. ఇక అందులోంచి బయటకు రావడం చాలా కష్టం.


పోలీస్ కార్‌తో రీల్స్..

లేటెస్ట్‌గా, నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు యువకులు చేసిన ఫీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏకంగా పోలీస్ పెట్రోలింగ్ వెహికిల్‌తోనే రీల్స్ చేశారు ఇద్దరు యువకులు. పార్క్ చేసి ఉన్న పోలీస్ కార్‌తో స్టైలిష్ వీడియో పోస్టులు పెట్టారు. ఒకడు డోర్ తీసి.. నేనేరా పోలీస్ అనే రేంజ్‌లో బిల్డప్ ఇచ్చాడు. ఆ ఇద్దరూ కలిసి పెట్రోలింగ్ వెహికిల్ వేసుకుని రౌండ్స్ కొట్టారు. ఎంచక్కా వీడియోలు తీసుకుని.. వాటిని మంచిగా ఎడిటింగ్ చేసి.. ఇంస్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇంకేం.. వెంటనే వైరల్ అయింది ఆ వీడియో. పోలీస్ కారుతో ఫోజులంటే మాటలా.. తెగ షేర్లు కొట్టేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల కంట పడింది. వార్నీ.. మా వాహనంతోనే రీల్స్ చేస్తారా? ఎవర్రా మీరంతా? అంటూ ఆ ఇద్దరు యువకులను ట్రేస్ చేసే పనిలో పడ్డారు పోలీసులు.


Also Read : హాస్పిటల్‌లో అలేఖ్య చిట్టీ.. ఇప్పుడెలా ఉందంటే..

అది పోలీసుల పనేనా?

ఇక్కడ పలు డౌట్స్. పోలీసుల వెహికిల్స్ వాళ్లకు ఎలా వచ్చింది? ఏకంగా ఖాకీల కారునే డ్రైవ్ చేసేంత సాహసం వాళ్లు ఎలా చేయగలిగారు? కారు పార్క్ చేసుంటే తీసుకెళ్లారా? మరి ఆ కారును కాప్స్ లాక్ చేయలేదా? పోలీస్ వాహనాన్ని ముట్టుకోవాలంటేనే చాలా మంది భయపడుతుంటారు? కానీ, ఆ ఇద్దరు అంత ధైర్యంగా ఎలా డ్రైవ్ చేశారు? అంటే, పోలీసులే వాళ్లకు ఆ వెహికిల్ ఇచ్చారా? ఆ పెట్రోలింగ్ కాప్స్.. ఆ యువకులకు ఫ్రెండ్స్ or రిలేటివ్స్ కావొచ్చా? ఎంత చుట్టమైనా పోలీస్ వాహనాన్ని ఇలా రీల్స్ కోసం ఇచ్చేస్తారా? ఇది ఎంత సీరియస్ క్రైమ్. అందుకే, ఇప్పుడు రీల్స్ చేసిన ఆ ఇద్దరు యువకులతో పాటు ఆ వెహికిల్‌కు చెందిన పోలీసులపైనా సీరియస్ యాక్షన్‌కు సిద్దమవుతున్నారు ఉన్నతాధికారులు.

Related News

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Big Stories

×