BigTV English

Food Poisoning: ఫుడ్ పాయిజన్ అయిందా ? ఇలా చేస్తే.. బిగ్ రిలీఫ్

Food Poisoning: ఫుడ్ పాయిజన్ అయిందా ?  ఇలా చేస్తే.. బిగ్ రిలీఫ్

Food Poisoning: వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా.. ఆహార పదార్థాలు త్వరగా చెడిపోతాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, బలహీనత వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి.. ఈ సీజన్‌లో ఆహారం,తీసుకునే డ్రింక్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.


వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే 10 సులభమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయండి:
వేసవిలో త్వరగా పాడైపోయే ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం చాలా ముఖ్యం. పాల ఉత్పత్తులను (పాలు, పెరుగు, జున్ను) ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. అంతే కాకుండా వండిన ఆహారాన్ని 2 గంటల్లోపు చల్లని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉంటుంది.


2.పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ :
వేసవిలో బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. కాబట్టి శుభ్రత చాలా ముఖ్యం. వంట చేయడానికి, తినడానికి ముందు ఎల్లప్పుడూ మీ చేతులను నీట్ గా కడుక్కోండి. కూరగాయలు, పండ్లను నీటితో శుభ్రం చేసిన తర్వాతే తినండి. వంటగది తువ్వాళ్లు, స్పాంజ్‌లు , కటింగ్ బోర్డులను క్రమం తప్పకుండా వాష్ చేయండి.

3.ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని తినండి:
వేసవిలో ఆహారం త్వరగా చెడిపోతుంది. కాబట్టి తాజా ఆహారాన్ని మాత్రమే తినండి. ఒక రోజు కంటే ముందు వండిన ఆహారాన్ని తినడం మానుకోండి. పెరుగు, జున్ను, పాలు వంటివి చెడిపోయిన వెంటనే పారవేయండి.

4. స్ట్రీట్ ఫుడ్ , ముక్కలు చేసిన పండ్లు:
సమ్మర్‌లో బయటి ఆహారం తినడం వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. రోడ్డు పక్కన అమ్మే కోసిన పండ్లను అస్సలు తినకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉంచిన చాట్, పానీపురి లేదా ఇతర ఆహార పదార్థాల తినడం వీలైనంత వరకూ నివారించండి.

5. ఎక్కువ నూనె, మసాలాలు:
ఎండాకాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త బలహీనంగా మారుతుంది. కాబట్టి తేలికైన ఆహారం తినండి. ఉడికించిన కూరగాయలు, సలాడ్ , పెరుగు తినండి. ఎక్కువగా వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉంటేనే బెటర్.

6.తగినంత నీరు త్రాగాలి:
వేసవిలో శరీరం త్వరగా డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. రోజంతా 8-10 గ్లాసుల నీరు తాగండి. బహిరంగ ప్రదేశాల్లో నీటిని తాగడం మానుకోండి. తాజా పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోండి.

7.ఉడికించిన ఆహారం:
సరైన ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని వండటం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. మాంసం, గుడ్లను బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తినండి. బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి.. ఆహారాన్ని కొద్దిగా వేడి చేసిన తర్వాత మాత్రమే తినండి.

Also Read: సమ్మర్‌లో పచ్చి ఉల్లిపాయలు తింటే.. ఇన్ని లాభాలా ?

8. పచ్చి, వండిన ఆహారం:
వండిన ఆహారంతో పాటు పచ్చి కూరగాయలు, పండ్లను కలిపి ఉంచవద్దు. ఎల్లప్పుడూ నాన్-వెజ్‌ను ప్రత్యేక కంటైనర్‌లో నిల్వ చేయండి.

9. డబ్బా, ప్యాక్ చేసిన ఆహారం:
ప్రాసెస్ చేసిన ఆహారాన్ని కొనే ముందు, దాని తయారీ తేదీ, గడువు తేదీని ఖచ్చితంగా చెక్ చేయండి. గడువు తేదీకి దగ్గరగా ఉన్న ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం మానుకోండి.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×