Alekhya Chitti Pickles Controversy : కస్టమర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న చిట్టీ పికెల్స్ అలేఖ్య హాస్పిటల్ పాలైంది. గత కొద్ది రోజులుగా ఆమెపై విపరీతమైన నెగెటివిటీ స్ప్రెడ్ కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యింది. డిప్రెషన్ లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో బాగా వీక్ అయినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు త్వరలో వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
ఇంకో చావును తట్టుకునే పరిస్థితిలో లేం- సుమ
నాన్న చనిపోయి మూడు నెలలు కూడా కావట్లేదని, ఇప్పుడు ఇంట్లో మరో విషాదం జరిగితే తట్టుకునే పరిస్థితి తమకు లేదని అలేఖ్య అక్క సుమ ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు గుర్తించి సారీ చెప్పినా ట్రోల్స్ చేయడం బాధాకరం అన్నారు. “అలేఖ్య హాస్పిటల్ లో ఉంది. బ్రీతింగ్ తీసుకోలేక ఇబ్బంది పడుతోంది. ఐసీయూలో ఆక్సీజన్ పెట్టారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎవరికీ రాకూడదు. తను చేసింది తప్పే. నేను కాదనడం లేదు. రియలైజ్ అయ్యింది. బయటకు వచ్చి సారీ చెప్పింది. యాక్సెప్ట్ చెయ్యొచ్చు కదా. పెద్ద వీడియో చేసే స్థితిలో ఆమె లేదు. అయినా, తను సారీ చెప్తూ వీడియో చేసింది. ఈ రోజు ఆ వీడియోకు కూడా ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. సోషల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెట్టి టార్చర్ చేస్తున్నారు. మొన్నే మా ఇంట్లో నాన్న చనిపోయారు. మూడు నెలల కూడా కాలేదు. ఇప్పుడు తను ఇలా అయ్యింది. మా ఇంట్లో ఇంకో చావును తట్టుకునే శక్తి మాకు లేదు. అలాంటి ఘటన ఇంకోటి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. పిల్లకు ఏం అవుతుందోననే భయం అవుతుంది. పచ్చళ్ల బిజినెస్ వద్దు. యూట్యూబ్ వద్దు. ఆమె సేఫ్ గా ఉంటే చాలు. దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రోల్స్, మీమ్స్ దయచేసి ఆపండి” అని విజ్ఞప్తి చేసింది.
మా నాన్న సమాధిని కూడా ట్రోల్ చేస్తారా? – రమ్య
అటు తమ తండ్రి సమాధిని కూడా ట్రోల్ చేయడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని అలేఖ్య చెల్లి రమ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమను వదిలేయాలని రిక్వెస్ట్ చేసింది. “మా ఇంట్లో రీసెంట్ గానే ఓ ఘటన జరిగింది. ఇప్పుడు మళ్లీ మా అక్కను హాస్పిటల్ పాలు చేశారు. మా అక్కకు ఏమైనా అయితే రెస్పాన్సిబులిటీ తీసుకుంటారా? మమ్మల్ని నిండా ముంచి కంప్లీట్ గా రోడ్డు మీదికి లాగేశారు. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. వాళ్లను కూడా ఇలాగే చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మా నాన్న చనిపోతే, ఆయన ఇష్ట ప్రకారం సమాధి చేశాం. దాని ఫోటోలు కూడా తీసి మీమ్స్ చేస్తున్నారా? మీరు మమ్మల్ని ఎంత చులకగా చూస్తున్నారో అర్థం అవుతోంది. మేం ఆడవాళ్లం. ఎలాంటి సపోర్టు లేదు. ఇప్పుడు మా పరిస్థితి దారుణంగా ఉంది. దయచేసి మా మీద ట్రోల్స్, మీమ్స్ ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. వ్యూస్ కోసం, రీచ్ కోసం మా మీద లేని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా వదిలేయండి ప్లీజ్” అని విజ్ఞప్తి చేసింది.
Read Also: పచ్చళ్ళ బిజినెస్ క్లోజ్.. అలేఖ్య చిట్టి కొత్త వ్యాపారం ఇదే!