BigTV English

Praneeth sent to judicial Custody: యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్

Praneeth sent to judicial Custody: యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్

Praneeth Hanumanthu sent to judicial Custody(Telangana news): సోషల్ మీడియాలో తండ్రి, కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ప్రణీత్ కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రణీత్ పై 67 ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు. గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను ఉన్నారు. ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.


Also Read: దారుణం.. ప్రేయసి తల్లిదండ్రులను గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది

ఇదిలా ఉంటే.. డ్రగ్ పెడ్లర్ నవీన్ అనే వ్యక్తిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆయిల్, వీడ్ ఆయిల్ విక్రయిస్తుండగా అతడని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 825 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ. 4 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన నవీన్ గతంలో వివిధ కేసుల్లోనూ జైలు జీవితం అనుభవించినట్లు పోలీసులు చెబుతున్నారు.


జైల్లో ఉండగా అతడికి ఏపీలోని అరకుకి చెందిన గంజాయి గ్యాంగ్ తో పరిచయం ఏర్పడిందని, జైలు నుంచి బయటకొచ్చిన తరువాత ఆ ముఠా నుంచి ఎండు గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గంజాయిని విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

Tags

Related News

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

puppy Adoption: శునకాల దత్తతకు మీరు సిద్ధమా? అయితే ఇక్కడికి వెళ్లండి!

Heavy rains alert: తెలంగాణను దంచికొట్టబోతున్న భారీ వర్షాలు.. 24 గంటల హెచ్చరిక!

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

Medak floods: గర్భగుడి వరకు చేరిన వరద నీరు.. మూసివేతలో తెలంగాణలోని ప్రధాన ఆలయం!

Heavy rains: రాష్ట్రంలో కుండపోత వానలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

Big Stories

×