E-Paper
Advertisement

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?
Advertisement

Auto Workers: నిత్యం ట్రాఫిక్ రద్దీలో శ్రమిస్తూ అద్దె ఇండ్ల భారంతో సతమతమవుతున్న హైదరాబాద్ ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు అందించింది. కోర్ అర్బన్ పరిధిలో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇండ్ల టవర్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.220 కోట్ల వ్యయంతో ‘ఆటోనగర్ కాలనీల’ నిర్మాణానికి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

నాలుగు ప్రాంతాల్లో 2,000 ఫ్లాట్ల నిర్మాణం

Advertisement

రాజధాని చుట్టుపక్కల ఉన్న బండ్లగూడ, గంధంగూడ, పేట్‌ బషీర్‌బాగ్‌, జల్ పల్లి లక్ష్మీగూడ ప్రాంతాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ నాలుగు చోట్ల భారీ టవర్లను నిర్మించనున్నారు. ఒక్కో ప్రాంతంలో 500 చొప్పున మొత్తం 2,000 ఎల్ఐజీ (LIG) ఫ్లాట్లను ఆటో కార్మికుల కోసం సిద్ధం చేయనున్నారు.

అర్హతలు, కేటాయింపు విధానం ఇదే..

Advertisement

ఇప్పటికే క్యూర్ పరిధిలోని అల్పాదాయ కుటుంబాల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల పథకం నిబంధనలే ఈ ఆటోనగర్ కాలనీలకు కూడా వర్తించనున్నాయి. లబ్ధిదారుల ఎంపిక, అర్హతలు, ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ అంతా ఆ పథకం విధివిధానాల ప్రకారమే జరుగుతుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఆటో కార్మిక కుటుంబాల సొంతింటి కల త్వరలోనే సాకారం కానుంది.

Also Read: భారత్‌ సమ్మిట్ వేదికగా రాజకీయ రగడ.. వీసాల రద్దు వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి?

Tags

Related News

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

హరీష్ రావును ఓడించడం పెద్ద విషయం కాదు.. సిద్దిపేటలో జెండా ఎగురవేస్తాం!- కవిత సంచలన వ్యాఖ్యలు

వీసీ సజ్జనార్ విషయంలో ఏం జరిగింది? 14 నెలలకే బదిలీ ఎందుకు? పోలీసు శాఖలో తీవ్రమైన చర్చ

తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌ని ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ముప్పు!

మోదీకి భజన చేసుకో.. అమిత్ షాకు పూజ చేసుకో..! కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ సెటైర్లు

Big Stories

Advertisement
×