E-Paper
Advertisement

కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!

కడుపులో విషం పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్ ఫైర్!
Advertisement

Bharat Summit: HICC నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ ఈరోజు రేపు ఘనంగా నిర్వహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు ఆకర్షించే విదంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందే విదంగా ఈ సమ్మిట్ జరుగుతుందని గ్లోబల్ సమ్మిట్ కూడా డిసెంబర్ 7, 8,9 న నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ సమ్మిట్‌లో 70 దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి రావాలని ఆహ్వానించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇద్దరూ ఓక్కటే..

వివిధ దేశాలు నుండి భారత్ సమ్మిట్ కు వస్తున్నా వారిని బీజేపీ అడ్డుకొంటుంది. BRS, బీజేపీ ఇద్దరు కూడా ఒకే ధోరణిలో విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వివిధ దేశాలలో ఉన్న ప్రముఖులను, నిపుణులను జర్నలిస్ట్‌లను సైతం భారత్ సమ్మిట్‌కు రావాలని పిలిచామని అన్నారు. బీజేపీ నేతలకు brs నేతలకు ఎందుకు అభ్యన్తరం.. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్టం పెట్టుబడుల కేంద్రంగా రూపొందించాలని ఈ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

గిగ్ వర్కర్స్ కోసం..

Advertisement

మొదటి నుండి ప్రజా ప్రయోజనం కలిగే పనులను బీజేపీ, brs వ్యతిరేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను బీజేపీ, brs కావాలని అడ్డుకుంటున్నారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం పాలసీ తీసుకొచ్చామని, రాహుల్ గాంధీ సమక్షంలో గిగ్ వర్కర్స్ సంక్షేమం కోసం పాలసీ ప్రారంభిస్తారని సీఎం క్లారిటీ ఇచ్చారు. ప్రధాన మంత్రి ఇతర దేశాలకు వెళ్లడం, పాకిస్తాన్ నవాబ్ షరీఫ్ ఇంటికెళ్లడం తప్పు కాదా.. రాహుల్ గాంధీ ఎం చేసిన తప్పేనా.. రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌ను ఉద్దేశించి మాట్లాడుతారు. ఎందుకు రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Also read: ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి..

Advertisement

ప్రజాస్వామ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రపంచంలో శాంతి కోసం చర్చలు జరగాల్సిన అవసరం ఉందని రేవంత్ అన్నారు. 1000 మందిని 70 దేశాలు ప్రతినిధులను హైదరాబాద్ రప్పించి తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని, బీజేపీ, brs నేతలు విజ్ఞత ప్రదర్శించాలన్నారు. గిగ్ వర్కర్స్ పాలసీ దేశంలో బెస్ట్ పాలసీగా రూపుదిద్దుకుంటుందని, వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టైన్ రైజర్ కార్యక్రమంలో పీయుష్ గోయల్ ముఖ్య అతిదిగా వచ్చాడు. అప్పుడు స్వాగతించిన బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ భారత దేశం ఆత్మ..

బీజేపీని వ్యతిరేకిస్తే భారత దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు.. కాంగ్రెస్ పార్టీ భారత దేశం ఆత్మ అని సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకరు వినర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రతిష్ట తగ్గదు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులలో ఉందని సీఎం రేవంత్ అన్నారు.

కడుపులో విషం..

ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఆహ్వానించినా హాజరు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో పాటుగా ఎల్ నినో పై అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించినా రాలేదని, అందుకే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను తెలంగాణ లెక్కల్లో లేరని భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అభివృద్ది కడుపులో విషం కళ్ళల్లో కోపం ఉందని కేటీఆర్, కిషన్ రెడ్డి పై రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: టికెట్ చెకింగ్ పేరుతో వసూళ్లు.. కిలేడీ ఆటకట్టించిన రైల్వే ఉద్యోగి!

Tags

Related News

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి

హైదరాబాద్ ‘డిజిటల్ అరెస్ట్’ మరణం కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఆటో డ్రైవర్లకు సర్కారు బంపర్ ఆఫర్.. రూ.220 కోట్లతో 2,000 ఫ్లాట్లు.. ఎక్కడెక్కడ కడుతున్నారంటే?

హెచ్‌ఐసీసీ భారత్ సమ్మిట్‌లో.. మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం!

జీహెచ్ఎంసీకి ఏమైంది? ఆదాయం లేకపోయినా ఆ రెండు కార్పొరేషన్ల భారం ఎందుకు?

విద్యుత్ శాఖలో మీటర్ బైపాస్ కుంభకోణం.. జోరుగా డబ్బులు వసూల్!

Big Stories

Advertisement
×