Big Stories

Zero Shadow : 2 నిమిషాలపాటు నీడ మాయం.. హైదరాబాద్‌లో అరుదైన ఘటన..

Zero Shadow : హైదరాబాద్‌లో అరుదైన సంఘటన జరిగింది. 2 నిమిషాలపాటు నీడ మాయమైంది. దీనినే జీరో షాడోగా పిలుస్తారని సైంటిస్టులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల 14 నిమిషాల మధ్య నీడ కనిపించలేదు. సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడటం వల్ల జీరో షాడో ఏర్పడింది. సూర్యకాంతిలో ప్రతి వస్తువుకు నీడ ఉంటుంది. కానీ జీరో షాడో సమయంలో ఎండలో 90 డిగ్రీల కోణంలో ఉంచిన ఏ వస్తువు నీడ కూడా రెండు నిమిషాలపాటు కనిపించలేదు.

- Advertisement -

ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వివరాల ప్రకారం జీరో షాడో సమయంలో ఏ వస్తువుపైనా కానీ, మనిషిపైన కానీ… సూర్యుడి కాంతి పడినా నీడ మాయమవుతుంది. దీనినే సాంకేతిక పరిభాషలో జెనిత్ పొజిషన్ అంటారని సైంటిస్టులు తెలిపారు. ఈ కారణంగానే జీరో షాడో డే వస్తుందని స్పష్టం చేశారు. ఏటా రెండుసార్లు ఈ ఫినామినన్ జరుగుతుందని ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కర్కాటక, మకరరేఖల మధ్యనున్న ప్రాంతాల్లోనే ఇది కనిపిస్తుంది. జీరో షాడో టైమ్‌లో సూర్యుడి అక్షాంశం, మనిషి అక్షాంశం సమాంతరంగా ఉంటాయి. అంటే సూర్యుడి కాంతి మనిషి పరిధిని దాటి పోలేదు. అందుకే నీడ పడదు.

- Advertisement -

బెంగళూరులోనూ ఏప్రిల్ 25న జీరో షాడో డే ఏర్పడింది. దాదాపు ఒకటిన్నర నిమిషంపాటు నీడ కనిపించలేదు. పలు క్యాంపస్‌లలో విద్యార్థులు, అక్కడి నగరవాసులు ఈ అద్భుత ఘట్టాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 3న మరోసారి హైదరాబాద్‌తో సహా దేశంలో మరికొన్ని ప్రాంతాలలో కూడా జీరో షాడో డే ఏర్పడుతుందని సైంటిస్టులు తెలిపారు. ఇది కేవలం భూమి-సూర్యుడు స్థాన చలనాల వల్ల ఏర్పడేదే కనుక ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని శాస్త్రవేత్తలు సూచించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News