BigTV English

Gold Price: కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price: కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

August 13th Gold Price: శ్రావణమాసం వచ్చీ రావడంతోనే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.75 వేల నుంచి రూ.69 వేలకు తగ్గిందని సంతోషించే లోపే.. మళ్లీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పైగా ముత్తైదువులంతా సౌభాగ్యం కోసం కలిసి చేసుకునే వరలక్ష్మివ్రతం దగ్గరపడుతున్న సమయంలో.. బంగారం ధరలు షాకిస్తున్నాయి. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.250 నుంచి రూ.270 మేర పెరిగాయి.


బులియన్ మార్కెట్ ప్రకారం.. హైదరాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.950 మేర పెరగడంతో.. రూ.65,650కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1040 మేర పెరగడంతో.. రూ.71,620కి ఎగబాకింది. ఇక 100 గ్రాముల మేలిమి బంగారంపై రూ.10,400 పెరిగింది. ప్రస్తుతం 100 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.7 లక్షల 16 వేల 200 గా ఉంది.

Also Read: షాకిచ్చిన బంగారం.. మళ్లీ రూ.70 వేలు దాటేసిందిగా !


వెండి కూడా నేనేమైనా తక్కువా అన్నట్లుగా ఉంది. నిన్న కిలో వెండిపై రూ.600 తగ్గగా.. నేడు రూ.1000 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.88,500 కి చేరింది.

ప్లాటినం ధర కూడా భారీగా పెరిగింది. నిన్న 100 గ్రాముల ప్లాటినంపై రూ.1400 తగ్గగా.. రూ.2,47,700 గా ఉంది. నేడు 100 గ్రాముల ప్లాటినంపై ఏకంగా రూ.4600 పెరగడంతో.. ధర రూ.2,52,30కి చేరింది. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో.. ఇక బంగారం ధర క్రమంగా తగ్గుతుందని చూస్తున్న పసిడి ప్రియులకు ఊహించనే షాకే తగులుతుంది. ఇప్పటికైనా బంగారం కొనాలనుకునేవారు త్వరగా కొనుగోలు చేసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Minimum Balance Account: బ్యాంకు మినిమమ్ బ్యాలెన్స్ కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?

Trump On Gold: దిగొచ్చిన పసిడి.. ‘బంగారు’ మాట చెప్పిన ట్రంప్, ఏమన్నారు?

PM-KMY Scheme: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ స్కీంలో నెలకు రూ. 55 కడితే చాలు..ఉద్యోగం చేయకపోయినా పెన్షన్ గ్యారంటీ..

BSNLలో 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే…ఏకంగా 600 జీబీ డేటా పొందే ఛాన్స్…ఎంత రీచార్జ్ చేయాలంటే..?

Real Estate: ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటే ఏంటి..? మీ సొంత ఇంటి కలను ఇలాంటి ఆఫర్స్ ఎలా ముంచేస్తాయి..

Real Estate: బ్యాంకులు వేలం వేసే ఇళ్లను చాలా చీప్‌గా కొనేయొచ్చు.. మరి, ఆ వేలంలో ఎలా పాల్గోవాలి ?

Big Stories

×