E-Paper
Advertisement

BRS MLAs Detained: గన్‌పార్క్ వద్ద గందరగోళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

BRS MLAs Detained: గన్‌పార్క్ వద్ద గందరగోళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
Advertisement

BRS MLAs Detained: హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలా సమయం తరువాత ఆందోళనను విరమించాల్సిందిగా పోలీసులు వారికి రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా వారు వినిపించుకోకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. భారీగా పోలీసులు చేరుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కు తరలించారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసింది. సర్కారు రిలీజ్ చేసిన క్యాలెండర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వకుండా కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ తో యువతను మభ్య పెడుతుందంటూ ఆయన విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో పోస్టుల సంఖ్య పెట్టలేదని ఆయన అన్నారు. జాబ్ క్యాలెండర్ పై సభలో చర్చించాలని కోరితే రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వలేదన్నారు. నాలుగు పేపర్లపై ఇష్టం వచ్చింది రాసుకొచ్చి దానిని జాబ్ క్యాలెండర్ అంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

Advertisement

Also Read: జాబ్ క్యాలెండర్.. వట్టి బోగస్: కేటీఆర్ కామెంట్స్

అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ప్రకటనలు చేశారని, ఇప్పటివరకు కొత్తగా ఎన్ని ఉద్యోగాలిచ్చారంటూ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. తెలంగాణ యువత తరఫున పోరాడుతుంటే తమను తిడుతున్నారంటూ ఆయన ఆరోపించారు.

Related News

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

Big Stories

Advertisement
×