BigTV English

Bigg Boss Telugu 8: జీనీగా మారిన నాగార్జున.. బిగ్ బాస్ 8 టీజర్ చూశారా.. ?

Bigg Boss Telugu 8: జీనీగా మారిన నాగార్జున.. బిగ్ బాస్ 8 టీజర్ చూశారా.. ?

Bigg Boss Telugu 8 Teaser: బిగ్ బాస్ సీజన్ 8 మొదలుకానుంది. ఇప్పటివరకు 7 సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్.. త్వరలోనే 8 వ సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. మొదటి రెండు సీజన్స్ కాకుండా మిగతా అన్ని సీజన్స్ కు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇక సీజన్ 8 కి కూడా నాగ్ నే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.


ఇప్పటికే పోస్టర్స్ హైప్ పెంచిన బిగ్ బాస్ యాజమాన్యం తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇక ఈసారి ఈ సీజన్ మరింత ఉత్కంఠగా ఉండబోతుందని తెలుస్తోంది. టీజర్ లో కమెడియన్ సత్య దొంగగా కనిపించగా.. జీనీగా నాగ్ కనిపించాడు. ఒక మ్యూజియంలో దొంగతనం చేస్తూ గర్ల్ ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతున్న సత్యకు అల్లావుద్దీన్ అద్భుత దీపం కనిపిస్తుంది. దాన్ని రుద్దగానే.. అందులో నుంచి పొగ పైకి వెళ్లి 8 షేప్ లోకి మారింది.

Also Read : బిగ్ బాస్ లో బుల్లి తెర హాటీస్..ఇక అందాల ఆరబోతే


ఇక అందులో నుంచి నాగార్జున వచ్చి.. కోరికలు కోరుకోమని చెప్పాడు. ఏం కావాలన్నా లిమిట్ లెస్ గా ఇస్తానని వరం ఇస్తాడు. అంతేకాకుండా ఒక కండీషన్ కూడా పెడతాడు. ఏది కోరుకున్నా ఒకసారి ఆలోచించి కోరుకోవాలని, ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదని చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది.

నాగ్ మాటలను బట్టి.. ఎంటర్ టైన్మెంట్ లిమిట్ లేకుండా ఉంటుందని, కండీషన్ అంటే ఏది చేసినా అలోచించి చేయాలనీ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సీజన్ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ కూడా అందరికి తెలిసినవారే వస్తున్నారని టాక్. మరి ఈసరి బిగ్ బాస్ ఎంత రచ్చ చేస్తుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్‌ భారీ ప్లాన్‌.. మొదటి రోజే కంటెస్టెంట్స్‌కి దిమ్మతిరిగే ట్విస్ట్‌, అదేంటంటే!

Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!

Bigg Boss AgniPariksha: సందడి చేసిన సత్యదేవ్.. ఇది మైండ్ గేమ్ కాదు.. అంతకుమించి!

Divvela Madhuri: బిగ్‌బాస్ ఆఫర్‌పై స్పందించిన దువ్వాడ కపుల్స్.. మాధురీని అలా అనేశాడేంటి?

Bigg Boss AgniPariksha: ఆదిరెడ్డి రివ్యూపై శ్రీజ దమ్ము రియాక్షన్.. ఇకనైనా మారండయ్యా!

Bigg Boss AgniPariksha: అగ్ని పరీక్ష అంటూ అవమానిస్తున్నారు.. బిగ్ బాస్‌పై సిద్దిపేట్ మోడల్ ఫైర్

Big Stories

×