E-Paper
Advertisement

Elon Musk Family : ఏడేళ్ల తర్వాత తండ్రిని కలిసిన మస్క్.. కుటుంబంలో భావోద్వేదం

Elon Musk Family : ఏడేళ్ల తర్వాత తండ్రిని కలిసిన మస్క్.. కుటుంబంలో భావోద్వేదం

Elon Musk Family : ఊహించని నిర్ణయాలు, అనుకోని ట్వీట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే స్పెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. ఈసారి తన కుటుంబం కారణంగా వార్తల్లోనిలిచారు. టెక్సాస్ తీరాన గత శనివారం జరిగిన రాకెట్ స్టార్ షిప్ ప్రయోగం విఫలమైనా.. మస్క్ కుటుంబంలో మాత్రం ఆనందం నెలకొంది. అందుకు కారణం.. దాదాపు ఏడేళ్ల తర్వాత ఎలాన్ మస్క్ తన ఫ్యామిలీని కలవడమే. మనుషులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సంస్థ చేపట్టిన స్టార్ షిప్ ప్రయోగానికి ఎలాన్ మస్క్ తన తండ్రి ఎరాల్ ను కూడా ఆహ్వానించినట్లు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.

ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్.. ఈ కార్యక్రమానికి తన మాజీ భార్య హౌడ్, మనవరాలు కోరాతో కలిసి హాజరయ్యారు. ఎలాన్ ను చూసిన తండ్రి ఎరాన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారని అతని మాజీ భార్య హైడ్ వెల్లడించారు. ఎలాన్ సైతం భావోద్వేగానికి గురయ్యాడని, కుటుంబాన్ని చూసి చాలా సంతోషించాడని తెలిపారు. వారిద్దరూ కూర్చుని చాలాసేపు ముచ్చటించారని, ఆ క్షణాలను తాను, తన కూతుళ్లు చూసి సంతోషించామన్నారు. ఏడేళ్ల తర్వాత తమ కుటుంబంలో ఇలాంటి భావోద్వేగపూరితమైన క్షణాలు వచ్చాయని తెలిపారు.

కాగా.. స్టార్ షిప్ ప్రయోగ సమయంలో మస్క్ కుటుంబం వీఐపీ గ్యాలరీలో కూర్చుని ప్రయోగాన్ని వీక్షించింది. ఎంఆర్ఎన్ఏ ప్రయోగం, ఆర్థోపెడిక్ సర్జరీ సంబంధిత విషయాలు, రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే స్టాటిన్స్ అనే ఔషధాల వాడకం వల్ల కలిగే ముప్పు వంటి విషయాలపై ఇద్దరూ చర్చించినట్లు ఎరాల్ చెప్పారని హైడ్ వెల్లడించారు. ఎలాన్ చివరిగా తన తండ్రిని 2016లో కలిశారు. సోదరుడు కింబల్ మస్క్ తో కలిసి సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ లో ఆయన 70వ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

×