BigTV English

Fastag Scam | ఫాస్టాగ్ రిఛార్జ్ పేరుతో లక్షలు దోచుకున్న సైబర్ దొంగ!

Fastag Scam | దేశంలో సైబర్ దొంగతనాలు, ఆన్​లైన్​ స్కామ్‌ల సంఖ్య రోజురోజకీ పెరుగిపోతోంది. సైబర్ మోసగాళ్లు పెట్టే ఆన్‌లైన్ లింక్లను ప్రజలు తెలిసీతెలియక నొక్కేస్తున్నారు. ఆ తరువాత వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులన్నీ మాయమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ‘ఫాస్ట్​టాగ్​’ నెపంతో ఒక దుండగుడు ఏకంగా 2.4లక్షలు

Fastag Scam | ఫాస్టాగ్ రిఛార్జ్ పేరుతో లక్షలు దోచుకున్న సైబర్ దొంగ!

Fastag Scam | దేశంలో సైబర్ దొంగతనాలు, ఆన్​లైన్​ స్కామ్‌ల సంఖ్య రోజురోజకీ పెరుగిపోతోంది. సైబర్ మోసగాళ్లు పెట్టే ఆన్‌లైన్ లింక్లను ప్రజలు తెలిసీతెలియక నొక్కేస్తున్నారు. ఆ తరువాత వారి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులన్నీ మాయమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా నమోదవుతున్నాయి. ఇప్పుడు తాజాగా ‘ఫాస్ట్​టాగ్​’ నెపంతో ఒక దుండగుడు ఏకంగా 2.4లక్షలు దోచేశాడు.


వివరాల్లోకి వెళితే.. ముంబై మహానగరంలోని నల్లాసోపారా ప్రాంతానికి చెందిన ఓ 47ఏళ్ల వ్యక్తి.. తన ఫాస్టాగ్​ అకౌంట్​ను రీఛార్జ్​ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ సమస్యను పరిష్కరించడానకి గూగుల్‌లో సెర్చ్​ చేశాడు. అక్కడ ఒక ఫోన్​ నెంబర్​ దొరికింది. ఆ నెంబర్​కు కాల్​ చేసి, తన ఫాస్టాగ్ రిఛార్జ్ కావడంలేదని..
​సమస్య గురించి చెప్పాడు. కానీ అవతలి వ్యక్తి ఒక మోసగాడని ఆ సమయంలో అతనికి తెలియదు.

ఆ తరువాత ఆ మోసగాడు ఫాస్టాగ్ సమస్య పరిష్కారం కావాలంటే వెంటనే ఓ యాప్ డౌన్​లోడ్​ చేయమన్నాడు. బాధితుడు ఆ యాప్ డౌన్‌లోడ్ చేసి.. అతని బ్యాంక్ వివరాలు ఆ యాప్‌లో నింపాడు. ఇది జరిగిన ఒక్క నిమిషం లోపే బాధితుడి ఫోన్‌కి వరుసగా 6 మెసేజ్‌లు వచ్చాయి. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి 6 ట్రాన్సాక్షన్స్​తో మొత్తం రూ. 2.4లక్షలు ఖాళీ అయ్యాయి. ఇది చూసిన బాధితుడు మళ్లీ అదే ఫోన్ చేయాలని ప్రయత్నించాడు. కానీ అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ వస్తోంది.


ఏం చేయాలో తోచని స్థితిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు ఇంతవరకు ఆ సైబర్ దొంగని పట్టుకోలేకపోయారు.

ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగకుండా ఉండాలంటే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ మెయిల్స్, మెసేజస్‌లలో వచ్చే ఆన్‌లైన్ లింక్లను ఓపెన్ చేయకూడదు. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ చెప్పకూడదు. ముఖ్యంగా తెలియని వారికి ఈ వివరాలు ఇవ్వకూడదు. ఏ బ్యాంకు, లేదా ఆన్‌లైన్ లావాదేవి సంస్థ వ్యక్తిగత వివరాలు అడగదు. అలా అడిగితే ఆ వ్యక్తి ఓ దుండగుడని అర్థం.

Related News

Nagpur Tragedy: దారుణ విషాదం… బైక్‌పై భార్య మృతదేహం కట్టి తీసుకెళ్లిన భర్త

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Big Stories

×