Big Stories

Congress complaints To EC against JP Nadda| రాహుల్ గాంధీ యానిమేషన్ వీడియోపై వివాదం.. జేపీ నడ్డాపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్

Congress complaints To EC against JP Nadda| లోక్ సభ ఎన్నకల నేపథ్యంలో బిజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సహా ముగ్గురు నాయకులపై ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బిజేపీ సోషల్ మీడియా విభాగం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వీడియో షేర్ చేసింది. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకూడదని ఆ వీడియోలో ఉందని కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులో పేర్కొంది.

- Advertisement -

బిజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బిజేపీ ప్రెసిడెంట్ బివై విజయేంద్ర, బిజేపీ సోషల్ మీడియా ఇంఛార్జ్ అమిత్ మాల్ వీయాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఫిర్యాదు చేసింది. బిజేపీ సోషల్ మీడియా విడుదల చేసిన వీడియోలో రాహుల్ గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను పోలీన యానిమేటెడ్ కార్టూన్లు ఎస్టీ, ఎస్సీ, ఓబిసీ వర్గాలకు వ్యతిరేకమని చూపిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకూడదని సూచించారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేసినట్లే అని ఫిర్యాదులో పేర్కొంటూ.. బిజేపీపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక కాంగ్రెస్ కమిటీ చీఫ్ రమేష్ బాబు ఈసీ అధికారులను కోరారు.

- Advertisement -

Also Read : ప్రధానిని మీరెప్పుడైనా టీవీల్లో చూశారా..? : ప్రియాంకా గాంధీ

కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల తొలి విడత ఏప్రిల్ 26న పూర్తవగా.. రెండో విడత పోలీంగ్ మే 7న జరుగనుంది. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవన్న, ఆయన తండ్రి హెచ్ డీ రేవన్నకు అశ్లీల వీడియోలు లీక్ కావడంతో దేశమంతా కర్ణాటక రాజకీయాల వైపు మళ్లింది. జెడిఎస్ తో పొత్తుపెట్టుకున్న బిజేపీ, అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడు ప్రజ్వల్ రేవన్న కోసం ప్రధాని మోడీ ప్రచారం చేయడంతో ప్రతిపక్షాలు బిజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బిజేపీ మహిళా నాయకులు, జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై ఇంతవరకు స్పందించక పోవడం గమనార్హం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News