BigTV English

Gold Rates : అక్షయ తృతీయ ముందు ప్రతాపం చూపిస్తున్న బంగారం…

Gold Rates : అక్షయ తృతీయ ముందు ప్రతాపం చూపిస్తున్న బంగారం…
Gold Rates

Gold Rates : పది గ్రాముల పసిడి ధర ఆల్‌మోస్ట్ 62వేలకు చేరింది. మున్ముందు దాదాపు 65 వేల రూపాయలను టచ్ చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మరో వారంలో అక్షయ తృతీయ ఉండడంతో.. కొనాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు వినియోగదారులు. 50వేలు ఉంటేనే చాలా కష్టంగా కొన్నారు. ఇప్పుడు పది గ్రాములు 60వేలు దాటింది. రేప్పొద్దున 65వేలకు చేరితే మధ్యతరగతి వాళ్లు కూడా బంగారం షాపు గుమ్మం కూడా తొక్కరు.


ఇంతకీ ఎందుకు పెరుగుతోంది బంగారం ధర? సింపుల్ ఫార్ములా. ప్రపంచం బాగుంటే బంగారం ధర తగ్గుతుంది. ప్రపంచంలో భయాలు పెరిగితే బంగారం ధర భగ్గుమంటుంది. రష్యా-ఉక్రెయిన్ వార్ ఆల్రడీ నడుస్తోంది. రేప్పొద్దున చైనా-తైవాన్ వార్ ఉండొచ్చన్న భయాలు వెంటాడుతున్నాయి. దానికి తోడు క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గిస్తామంటున్నారు. అదే జరిగితే క్రూడాయిల్ ధర మళ్లీ పెరుగుతుంది. అంటే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగి మళ్లీ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. సో, మళ్లీ వడ్డీరేట్లు పెంచే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు మార్చి నెలలో అమెరికాలో జాబ్స్ తగ్గాయి. ఇది కూడా ఎఫెక్ట్ చూపుతోంది. ఓవరాల్‌గా అమెరికా సహా యూరప్ దేశాల జీడీపీ తగ్గుతోంది. ఆర్థిక మాంద్యం భయాలు, బ్యాంకింగ్ సంక్షోభం వెంటాడుతోంది. ఇన్ని కారణాల వల్ల బంగారం ధర పెరుగుతోంది. రేప్పొద్దున ఎటొచ్చి ఏం జరిగినా.. బంగారానికేం కాదు అనే భరోసాతో ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే, బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది.

ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800కి చేరింది. వెండి కూడా బంగారం బాటలోనే వెళ్తోంది. కిలో వెండి ధర రూ. 79,600కు చేరుకుంది.


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650
24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650..
24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,650..
24 క్యారెట్ల బంగారం ధర రూ.61,800

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200..
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,400

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,700..
24 క్యారెట్ల బంగారం ధర రూ.61,850

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×