Rishad Hossain : భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. తొలుత పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు పహల్గామ్ పై దాడి చేయడంతో భారత్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందనే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలని చెప్పడంతో కాస్త శాంతిగా ఉన్నారు. ఆ తరువాత వెంటనే పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసింది. దానిని భారత్ తిప్పి కొట్టింది.
Also Read : IPL Resumption: ఐపిఎల్ వెంటనే ప్రారంభిస్తాం.. శుభవార్త తెలిపిన చైర్మన్
మరోవైపు పీఎస్ఎల్ కోసం పాకిస్తాన్ కి వెళ్లిన విదేశీ ఆటగాళ్లు ఇండియా, పాకిస్తాన్ యుద్ధం వల్ల తీవ్ర భయాందోళనకు గురయ్యారని బంగ్లాదేశ్ కి చెందిన రిషద్ హుస్సెన్ తెలిపారు. పీఎస్ఎల్ రద్దయ్యాక ఫ్లైట్ లో దుబాయ్ కి వెళ్లామని.. అక్కడ దిగగానే మేము బయలుదేరిన తరువాత పాకిస్తాన్ విమానాశ్రాయాన్ని క్షిపణీ ఢీ కొన్నదనే వార్త విన్నాం. సామ్ బిల్లింగ్స్, మిచెల్, పెరీరా, టామ్ కరన్ చాలా భయపడిపోయారు. ప్రధానంగా టామ్ కరన్ మాత్రం చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. మిచెల్ మాత్రం మళ్లీ పాకిస్తాన్ కి ఎప్పుడూ కూడా రాను అని చెప్పారు. పాకిస్తాన్ పీఎస్ఎల్ ని నిరవధికంగా నిలిపివేసింది. పహల్గామ్ లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో సరిహద్దుమ ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ సూపర్ లీగ్ సీజన్ 10లోని మిగిలిన 8 మ్యాచ్ లు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
పీఎస్ఎల్ లోని విదేశీ ఆటగాళ్లను యూఏఈకి తరలించారు. అక్కడి నుంచి వారి తుది గమ్యస్థానాలకు అనుసంధాన విమానాల్లో బుక్ చేసుకున్నారు. పీఎస్ఎల్ లో లాహోర్ ఖలందర్స్ జట్టులో భాగమైన రిషద్, తమ విమానం టేకాప్ అయిన విమానాశ్రయం 20 నిమిషాల తరువాత క్షిపణి దాడికి గురైందని తెలుసుకోవడంతో భయానకంగా ఉందని వెల్లడించారు. టాక్ కరన్ గురించి రిషద్ హుస్సెన్ మాట్లాడుతూ.. అతను విమానాశ్రయానికి వెళ్లాడు. కానీ విమానాశ్రయం మూసీ వేయబడిందని తెలిపాడు. ఆ తరువాత అతను చిన్ పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు ఊరుకోమని చెబితే అతను ఊరుకోలేదని వెల్లడించాడు.
ఇక ఈ సమావేశం ప్రాథమికంగా ఇతర దేశాల వారు ఏమనుకుంటున్నారో.. వారి పరిస్థితి ఏంటో తెలుసుకోవడానికి పిలిచారు. దాదాపు అందరూ విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ తరువాత మ్యాచ్ లకు అందుబాటులో ఉన్న ఏకైక సురక్షితమైన స్థలం దుబాయ్ అని చెప్పారు. మరోవైపు పీసీబీ చైర్మన్ మిగిలిన మ్యాచ్ లను కరాచీలో నిర్వహించమని మమ్ముల్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. దానికి ముందు రోజు రెండు డ్రోన్ దాడులు జరిగాయని మాకు తరువాత తెలిసింది. ఆ తరువాత మేమందరం దుబాయ్ కి వెళ్లేందుకు నిర్ణయిం తీసుకున్నాం. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో దుబాయ్ కి సురక్షితంగా చేరుకోవడానికి పీసీబీ చైర్మన్ మాకు సహాయం చేశాడని రిషద్ హుస్సెన్ వెల్లడించాడు.