BigTV English
Advertisement

Ladakh Tour: లడఖ్‌‌.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?

Ladakh Tour: లడఖ్‌‌.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్, ఎందుకంత స్పెషల్ అంటే ?

Ladakh Tour: లడఖ్ దేశంలోని అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంటుంది. ఈ ప్రదేశంలో మీరు చూసే పర్వతాల సహజ సౌందర్యం, ప్రకృతి అందాలు మరెక్కడా కనిపించవు. ఇది దేశంలోని అత్యంత ప్రశాంతమైన ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశంలో చూడటానికి చాలా పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ మంచుతో కప్పబడిన పర్వతాలు, అందమైన సరస్సులను చూడటానికి వివిధ ప్రదేశాల నుండి టూరిస్టులు వస్తారు. లడఖ్ పర్యటనలో.. అనేక దేవాలయాలు, మఠాలు కూడా చూడొచ్చు. లడఖ్ రోడ్డు ప్రయాణాలకు కూడా చాలా ఫేమస్. లడఖ్‌లో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలను గురించి తెలుసుకుందాం.


లడఖ్ సంస్కృతి చాలా వైవిధ్యమైనది. గొప్పది కూడా. ఈ ప్రదేశంలోని ఆహారం, పండుగలు , వేడుకలు అందరికీ నచ్చుతాయి. ఇక్కడ పండుగలు, వేడుకల సమయంలో ప్రజలు తమ కళలను ప్రదర్శిస్తారు. లడఖ్ ప్రాంతంలో టిబెటన్ బౌద్ధమతంతో పాటు, ఇతర సాంస్కృతిక ప్రభావాలు కూడా కనిపిస్తాయి.

లడఖ్ లోని పర్యాటక ప్రదేశాలు :


లడఖ్‌లో చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి. ఈ ప్రదేశాలకు వచ్చిన తర్వాత ప్రజలు ఎక్కువగా రోడ్ ట్రిప్‌లకు వెళ్లడానికి ఇష్టపడతారు. ఇక్కడ కార్ రైడింగ్ నుండి బైకింగ్ కూడా వెళ్లొచ్చు. లడఖ్ గ్రామాలు చాలా అందంగా ఉంటాయి. ఇది ఫోటోగ్రఫీకి చాలా అనుకూల మైన ప్రదేశం

లడఖ్ ట్రిప్:
హిమాలయాలలో లెహ్-లడఖ్ సమీపంలో ఉన్న పాంగోంగ్ సరస్సు దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశాన్ని చూడటానకి రెండు కళ్లు సరిపోవు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ ప్రదేశాన్ని చూడటానికి వస్తారు. ఈ ప్రదేశంలో అనేక సినిమాల షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సరస్సు దాని సహజ సౌందర్యం, స్వచ్ఛమైన నీరు , అందమైన కొండలకు ప్రసిద్ధి చెందింది. లడఖ్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ -5 డిగ్రీల సెల్సియస్ నుండి 10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఈ సరస్సు చలికాలంలో పూర్తిగా గడ్డకట్టుకుని ఉంటుంది. దీని కారణంగా ఈ ప్రదేశం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.

అయస్కాంత కొండ:
లడఖ్‌లో ఉన్న మాగ్నెటిక్ హిల్‌ను గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం లెహ్ నుండి దాదాపు 30 కి.మీ దూరంలో సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి లేదా మరేదైనా కారణం వల్ల వాహనాలు వాటంతట అవే కొండ వైపు కదులుతాయి. లడఖ్‌లోని ఈ మాగ్నెటిక్ హిల్ చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు. ఈ ప్రదేశంలోనే.. టిబెట్ నుండి ఉద్భవించిన సింధు నది కొండ యొక్క తూర్పు భాగంలో ప్రవహిస్తుంది. ఇది లడఖ్ సందర్శించే పర్యాటకులకు ఒక అందమైన స్టాప్. ఈ ప్రదేశంలో నది అందాలను చూడటం మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

Also Read: ముంబై టూర్.. తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు ఇవే !

లెహ్ ప్యాలెస్ :
లేహ్ లడఖ్‌లోని లెహ్ ప్యాలెస్ ఒక ప్రధాన చారిత్రక ప్రదేశం. దీనిని ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శిస్తారు. ఇది మన భారతదేశపు అతిపెద్ద చారిత్రక ఆస్తులలో ఒకటి. ఈ అద్భుతమైన , ఆకర్షణీయమైన నిర్మాణం 17వ శతాబ్దంలో రాజు సెంగే నాంగ్యాల్ ఒక రాజభవనంగా నిర్మించాడు. రాజు, అతని మొత్తం రాజకుటుంబం ఈ భవనంలో నివసించారు. లెహ్ ప్యాలెస్ ఆ కాలంలో నగరంలో నిర్మించిన ఎత్తైన భవనాల్లో ఒకటి. ఈ ప్యాలెస్ మొత్తం తొమ్మిది అంతస్తులను కలిగి ఉంది. దీని పై నుండి మొత్తం నగరం యొక్క అందమైన దృశ్యాలను చూడవచ్చు.

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×