BigTV English

Ponniyin Selvan 2 Twitter Review : పొన్నియన్ సెల్వన్-1ను మించిన హిట్.. పాజిటివ్ టాక్..

Ponniyin Selvan 2 Twitter Review :  పొన్నియన్ సెల్వన్-1ను మించిన హిట్.. పాజిటివ్ టాక్..

Ponniyin Selvan 2 Twitter Review : స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘పొన్నియన్‌ సెల్వన్‌’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా 2 పార్ట్స్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫస్ట్ పార్ట్ గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైంది. ఈ మూవీని ప్రేక్షకులు బాగా ఆదరించారు. దీంతో పొన్నియన్ సెల్వన్ -1 భారీ విజయం సాధించింది. ఇక సెకండ్ పార్ట్ తాజా విడుదలైంది.


పొన్నియన్‌ సెల్వన్‌ -2 ఫస్ట్‌ షో సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. మూవీ చాలా బాగుందంటున్నారు. పార్ట్‌ 1లో కథనం స్లోగా సాగితే.. పార్ట్‌ 2లో మాత్రం స్పీడుందని అభిప్రాయపడుతున్నారు.

చిత్రంలో ఆర్ట్ డిజైన్ , పాటలు డీసెంట్‌గా ఉన్నాయని టాక్ వచ్చింది. స్క్రీన్‌ప్లే కూడా పార్ట్‌ 1 కంటే బాగుందని ట్విట్టర్ లో కామెంట్లు చేస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్, రవివర్మ సినిమాటోగ్రఫీపై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.


ఫస్ట్ హాఫ్ బాగా ఆకట్టుకుందని టాక్​. సెకండాఫ్ అదిరిపోయిందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. విజువల్స్, సీజీ వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని అంశాలు సినిమాకు హైలై​ట్ గా నిలిచాయని అంటున్నారు. క్లైమాక్స్ అదిరిపోయిందని చెబుతున్నారు. సినిమాలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయని అంటున్నారు. ఓవరాల్ పొన్నియన్ సెల్వన్ -2పై మంచి టాక్ నడుస్తోంది.

Tags

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×