Squid Game Season 3:డబ్బు కోసం ఒక మనిషి ఆడే నెత్తుటి ఆడే ‘స్క్విడ్ గేమ్'(Squid Game).. ఓటీటీ లలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సిరీస్ లలో ఒకటిగా ఇది పేరు సొంతం చేసుకుంది ముఖ్యంగా ఈ సిరీస్ గురించి తెలియని వారంటూ ఉండరేమో.. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్ట్ లకి కూడా విపరీతమైన క్రేజ్ లభించింది. ఇక మూడవ సీజన్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఒక దానికి మించిన మరొక సీజన్ ఆడియన్స్ లో ఉత్కంఠత రేకెత్తించింది. అందుకే ఇప్పుడు మూడవ భాగం కోసం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆడియన్స్ కోసం మూడవ సీజన్ ని కూడా తీసుకురావడానికి సిద్ధమయ్యారు. హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వంలో చివరి సిరీస్ ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ సిరీస్ నుండి ట్రైలర్ను విడుదల చేశారు. అన్ని పనులు పూర్తి చేసుకొని జూన్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 స్ట్రీమింగ్ కి సిద్ధం అవుతుంది. అంతేకాదు ఈ గేమ్ చివరి దశకు వచ్చింది అని ఇక ఇదే చివరి సిరీస్ అని స్పష్టం చేశారు మేకర్స్ .
ట్రైలర్ ఎలా ఉందంటే?
తాజాగా ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 కి సంబంధించి ట్రైలర్ ను హిందీలో విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే రక్తపు మరకలతో కూడిన ఫ్లోర్ కనిపిస్తుంది. ఇక ఆట సిద్ధం అవ్వగానే వెనుక నుంచి అభ్యర్థులు భయంతో ఒక్కొక్కరిగా లోపలికి అడుగుపెడతారు. ఎదురుగా ఒక పెద్ద బొమ్మ కనిపిస్తుంది. ఆ పెద్ద బొమ్మ ఒక తాడు పట్టుకొని ఉంటుంది. బటన్ ప్రెస్ చేయగానే తాడును విసురుతుంది. అయితే ఆ తాడును తప్పించుకోవాల్సి ఉంటుంది.లేదంటే పైనుంచి కిందకి తోసేస్తుంది. ఈ భయంకరమైన ఆటలో చాలామంది పట్టు కోల్పోయి ప్రాణాలు విడుస్తారు. ఇక హీరో ఎలాగైనా సరే ఈ ఆటకు ముగింపు పలకాలని చేసే ప్రయత్నమే ఈ సీజన్ 3 ట్రైలర్లో చూపించారు. ముఖ్యంగా షియోంగ్ జీ హున్ ఆ ఫ్రంట్ మ్యాన్ ను కనిపెట్టి అంతం చేశాడా లేదా అనేది ఇప్పుడు ఈ సీజన్లో చూపించనున్నారు. ఇకపోతే అధ్యంతం ఈ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఇది చూసిన నెటిజన్స్ వామ్మో ఆ ఆటలు ఏంటి? గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిరాశలో అభిమానులు..
ఇకపోతే ఈ స్క్విడ్ గేమ్ సిరీస్ కి బాగా అడిక్ట్ అయినా ఫాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. సీజన్ ల కోసం ఎదురుచూసేవారు ఇప్పుడు ఈ సీజన్ చివరి సీజన్ అని చెప్పడంతో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఇంకొంతమంది ఇలాంటి భయంకరమైన ఆటలు ఉండే సిరీస్ కొంతవరకు ఓకే కాని ఇది బ్రెయిన్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఈ సీజన్తో ఎండ్ చేసి మంచి పని చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:Squid Game Season 3: అఫీషియల్ ట్రైలర్ రిలీజ్.. ఇక్కడితో గేమ్ ముగిసేనా?