BigTV English
Advertisement

Couple Win Refund: రైల్వేతో న్యాయపోరాటం, మూడేళ్ల తర్వాత రీఫండ్ పొందిన వృద్ధ దంపతులు!

Couple Win Refund: రైల్వేతో న్యాయపోరాటం, మూడేళ్ల తర్వాత రీఫండ్ పొందిన వృద్ధ దంపతులు!

Indian Railways: ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారు. అనుకున్న సమయానికి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఇంతలో వారు ఎక్కాల్సిన రైలు వచ్చింది. కానీ, అప్పటికే రిజర్వేషన్ బోగీలోనూ ప్రయాణీకులు కిక్కిరిసిపోయారు. వృద్ధ జంట కావడంతో ఎక్కలేకపోయారు. ఇదే విషయాన్ని స్టేషన్ అధికారులకు చెప్పారు. తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరారు. కానీ, వారికి రైల్వే అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. పరిహారం కోసం వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. మూడేళ్లు పోరాటం చేసి రైల్వేపై విజయం సాధించారు. టికెట్ ఖర్చులతో పాటు అదనపు పరిహారం అందించాలని రైల్వేను వినియోగదారుల ఫోరం ఆదేశించింది. తమ విజయం పట్ల సదరు వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

కర్నాటక వైట్‌ ఫీల్డ్‌ లోని హూడికి చెందిన పూర్ణ రామకృష్ణ, అతడి భార్య హైమావతి మార్చి 29, 2022న కృష్ణరాజపురం (KJM) రైల్వే స్టేషన్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు స్లీపర్ క్లాస్ టికెట్లు బుక్ చేసుకున్నారు. రూ. 892.5 చెల్లించిన తర్వాత టికెట్లు కన్ఫార్మ్ అయ్యాయి. ఏప్రిల్ 13న ప్రయాణం కోసం రైల్వే స్టేషన్ కు వెళ్లారు. ఆటోలో ఇంటి నుంచి స్టేషన్ కు వెళ్లేందుకు మరో రూ. 165 ఖర్చు అయ్యాయి. ఎస్ 2 కోచ్ లో తనకు బెర్తులు కేటాయించారు. కానీ, రైలు ప్లాట్ ఫారమ్ మీదికి వచ్చే సరికి అన్ని బోగీలు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయాయి. ఆ వృద్ధజంట రైల్లోకి ఎక్కలేకపోయింది. సాయం చేసేందుక రైల్వే సిబ్బంది కూడా లేరు. ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత తమ టికెట్ డబ్బులు ఇవ్వాలని రైల్వేకు విజ్ఞప్తి చేశారు. కానీ, రైల్వే అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు.


మూడేళ్ల తర్వాత కీలక తీర్పు

రైల్వే నుంచి సరైన స్పందన రాకపోవడంతో రామకృష్ణ దంపతులు వినియోగదారుల ఫోరమ్ ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అయితే, రైల్వే అధికారులు మ వాదన వినిపిస్తూ, రైలు స్టేషన్‌ కు చేరుకున్నప్పుడు ఎలాంటి రద్దీగా లేదన్నారు. రైల్వే అధికారులు లేరనే వాదనను ఖండించారు. అదే సమయంలో వృద్ధ జంట తప్ప 134 మంది ప్రయాణీకులు ఆ స్టేషన్ లో ఎక్కారని చెప్పారు. అక్కడ స్టేషన్ మాస్టర్, RPF సిబ్బంది ఉన్నప్పటికీ వారికి ఫిర్యాదు చేయాలేదన్నారు. రీఫండ్ కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. కన్ఫర్మ్ టికెట్లను క్యాన్సిల్ చేయకపోతే, లేదంటే బయల్దేరడానికి 4 గంటల ముందు TDR దాఖలు చేయకపోతే రీఫండ్ తిరిగి చెల్లించబడదన్నారు. అదే సమయంలో మే 6, 2022న రాసిన లేఖలో టికెట్ లేని ప్రయాణాలు పెరిగాయని అంగీకరించారు. ఈ పాయింట్ బేస్ కేసుకుని కేసు వాదన కొనసాగింది. టికెట్ లేని ప్రయాణీకులు రిజర్వు కోచ్ లోకి ఎక్కడం వల్లే వృద్ధ జంట రైల్లోకి ఎక్కలేకపోయారని వినియోగదారుల ప్యానెల్ అభిప్రాయపడింది. టికెట్ కోసం ఖర్చు చేసని రూ.892.5 తిరిగి చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. వారిని మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.5,000 చెల్లించాలన్నది. వ్యాజ్యం ఖర్చులుగా రూ.3000 చెల్లించాలని ఆదేశించింది. మూడేళ్ల తర్వాత విజయం సాధించడం పట్ల వృద్ధ జంట సంతోషం వ్యక్తం చేసింది.

Read Also: ఉక్రెయిన్ సరిహద్దుల్లోకుప్పకూలిన వంతెన, రష్యా రైలు పట్టాలు తప్పి స్పాట్ లోనే..

Related News

Indian Railway: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Big Stories

×