Jharkhand Train Accident: ఈ మధ్యకాలంలో తరుచుగా రైళ్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఏదొక ప్రదేశంలో ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఒడిశాలోని కటక్ జిల్లాలో రైలు ప్రమాదం నర్గుండి రైల్వే స్టేషన్‌లో సమీపంలో కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్సెప్రెస్ పట్టాలు తప్పిన సంగతి తెలిసిందే.. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని సాహిబ్ గంజ్ జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యంలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ పరిధిలో రండు గూడ్స్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. నలుగురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో.. బొగ్గుతో నిండిన వ్యాగన్ లలో మంటలు చెలరేగాయి.
వెంటనే సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఎంజీఆర్ లైన్ పూర్తిగా కార్పోరేషన్ యాజమాన్యంలో ఉందని.. భారత రైల్వేల పరిధిలోకి రాదని అధికారులు స్పష్టం చేశారు. లోకో, ట్రాక్ సిబ్బంది నిర్వహణ, సిగ్నల్స్ పూర్తిగా ఎన్టీపీసి నిర్వహణలో ఉన్నాయి.
Also Read: ట్రైన్ టాయిలెట్స్‌లో నీళ్లు రాకపోతే రైల్వే మనకు డబ్బులు చెల్లిస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఈ ఘటనలో భారత రైల్వే ప్రమేయం లేదని ప్రకటనలో వెల్లడించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, అధికారుల నిర్లక్ష్యం వల్లా లేక టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్రేన్ సహాయంతో పట్టాలను తప్పించి సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.